సర్వంకెవిపి
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ 12-08-2005
హైదరాబాద్:ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిమిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వసలహాదారుడు కెవిపి రామచంద్రరావుకొడుకు పెళ్ళికి మంత్రులు,ఉన్నతాధికారులు తరలి వెళ్ళారు.హోంమంత్రి జానారెడ్డి మినహా దాదాపుఅందరూ కెవిపిని మంచి చేసుకోడానికిచెన్నై వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వవ్యవహారాలన్నీ కెవిపిరామచంద్రరావు చుట్టూరాతిరుగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యమంత్రి, ఆయన భార్య విజయమ్మకూడా చెన్నై వెళ్ళి అక్షింతలు వేసివచ్చారు.
మార్కెట్‌యార్డు పదవుల నుంచి అధికార భాషాసంఘం అధ్యక్షుడి వరకు కెవిపిరామచంద్రరావు అనుమతి లేకుండానియమితులు కావడం లేదు.చంద్రబాబు నాయుడు హయాంలో ఆయనఒక్కరే చక్రం తిప్పేవారు. వైఎస్‌హయాంలో ఆయనతో పాటురామచంద్రరావు అధికారకేంద్రమయ్యారు. మంత్రులకు ఆనాడూఈనాడూ పరిమిత పాత్రే. కాంగ్రెస్‌శ్రేణులన్నీ రామచంద్రరావునుప్రసన్నం చేసుకోడానికిఆరాటపడుతున్నాయి.రామచంద్రరావు, రాజశేఖరరెడ్డికర్నాటకలో ఎంబిబిఎస్ చదివినప్పటి నుంచిమంచి మిత్రులు. రాజశేఖరరెడ్డి ఇటీవలవిదేశాలకు వెళ్ళినప్పడు, ఓక్స్‌వ్యాగన్‌వ్యవహారంపై అధిష్టానవర్గానికివివరణ ఇచ్చేందుకురామచంద్రరావు ఢిల్లీ వెళ్ళారు.
రామచంద్రరావుసమాజిక వర్గానికి చెందిన వడ్డేపల్లినరసింగరావు వంటి భూకబ్జాదారులు కూడా కార్పొరేషన్‌చైర్మన్లు అయ్యారు. వడ్డేపల్లి వంటివారిపై అధిష్టానవర్గానికి ఫిర్యాదులువెళ్ళాయి. హైకమాండ్ వైఎస్‌కు ఈవిషయాన్ని వివరించినా వైఎస్‌సమర్ధించుకున్నారు. వడ్డేపల్లిది చిన్నఉదాహరణ మాత్రమే. ప్రభుత్వానికికళ్ళు, చెవులుగా రామచంద్రరావువ్యవహరిస్తున్నారు.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications