వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్మసిన్మాకువిదేశీ ఫండ్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాంగోపాల్‌ వర్మ తీయనున్న ఒక సినిమాకు అమెరికాకుచెందిన ఒక సంస్ధ నిధులు సమకూర్చనుంది. లాస్‌ఎంజెల్స్‌కు చెందిన ఫిల్మ్‌ ఫైనాన్స్‌ఇన్‌కార్పొరేషన్‌ ఫైనాన్స్‌ చేయనున్నరెండు బాలీవుడ్‌ సినిమాల్లో వర్మచిత్రం ఒకటి. మన్మోహన్‌ శెట్టికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ వన్‌సంస్ధ మరొకటి. దీనితో బాలీవుడ్‌లోకిగ్లోబల్‌ ప్రమాణాలు, కార్పొరేట్‌ ్రస్టక్చర్‌వచ్చే అవకాశముంది. ఏటా వెయ్యి సినిమాలుతీసే బాలీవుడ్‌ సినిమాల సంఖ్యలోప్రపంచంలోనే అతి పెద్ద సినిమాపరిశ్రమ.

సినిమాకు సకాలంలోపూర్తి చేయకపోవడం, అనుకున్న బడ్జెట్‌లు మించిపోవడం వంటి లోపాలు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ఉన్నాయి. విదేశీపెట్టుబడిదారులు వస్తే పరిస్ధితులు చక్కబడే అవకాశముంది.

ఫిల్మ్‌ ఫైనాన్సెస్‌సంస్ధ నిర్మాత నుంచి ఫిల్మ్‌ ప్రాజెక్టుపైగ్యారంటీ తీసుకుంటుంది. ప్రాజెక్టుసకాలంలో పూర్తయ్యేలా నటీనటులకు కొన్నినిబంధనలు పెడుతుంది. బాలీవుడ్‌లోప్రవేశించడానికి ఇది తగిన సమయమనిభావించామని, బాలీవుడ్‌ విదేశీ కంపెనీలకుస్వాగతం పలకడం ఆనందంగా ఉందనిఫిల్మ్‌ ఫైనాన్సెస్‌ సంస్ధ ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ సోమెస్‌ అభిప్రాయపడ్డారు.సినిమా షూటింగ్‌ తదితర కార్యక్రమాలను ఈసంస్ధ రోజువారీ పర్యవేక్షిస్తుంది.

రాంగోపాల్‌ వర్మఫ్యాక్టరీ సర్కార్‌ బూత్‌ సినిమాలు,శెట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌ వన్‌మున్నాబాయ్‌ ఎంబిబిఎస్‌ గంగాజల్‌వంటి సినిమాలు విదేశీ ఫైనాన్స్‌సంస్ధలను విశేషంగా ఆకర్షించాయి. ఫిల్మ్‌ఫైనాన్సెస్‌ సంస్ధ ఇప్పటివరకు 6,000 సినిమాలకు,టీవీ కార్యక్రమాలకుఫైనాన్స్‌ చేసింది. ఈ డీల్‌ ద్వారా బాలీవుడ్‌లోక్రమశిక్షణ వె లకొంటుందన్న ఆశాభావాన్ని రాంగోపాల్‌వర్మ వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X