వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్రవితండవాదం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 01-10-2005

హైదరాబాద్‌:చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగాఉంది టిఆర్‌ఎస్‌ నాయకుడు నరేంద్రవ్యవహారం. నరేంద్ర బుర్రలో పుట్టిన తెలంగాణ జాగరణ సేనవివాదాస్పదం కావడం, ఈ సేన ఏర్పాటువల్లనే మునిసిపల్‌ ఎన్నికల్లోటిఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలిందనిఅందరూ అంగీకరి స్తున్నా నరేంద్ర ఇంకావితండ వాదం చేస్తున్నారు. ఉమాకాంత్‌ టిజెస్‌లోనేకొనసాగుతారని, టిజెస్‌కు అధినేతగాముస్లింను నియమించబోమని శనివారంనరేంద్ర బహిరంగ ప్రకటన చేయడంచంద్రశేఖరరావుతో సహాటిఆర్‌ఎస్‌ నాయకులను విస్మయపరిచింది.దీనితో టిఆర్‌ఎస్‌లో చిచ్చి మరింత పెరిగేఅవకాశముంది.

టిఆర్‌ఎస్‌నుంచి వైదొలగి ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులసహకారంతో కొత్త ఉద్యమాన్ని చేపట్టడానికికూడా నరేంద్ర సిద్ధంగాఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయనతెగేవరకు లాగుతున్నారన్నఅభిప్రాయం ఉంది. కరడు గట్టినతెలంగాణ వాదులను తయారు చేయడమే తమధ్యేయమని నరేంద్ర శనివారం స్పష్టంచేశారు.ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం గల నరేంద్ర చాలా కాలం బిజెపిలో ఉండి ఆక్కడ తనకుసరైన గౌరవం దక్కలేదనిటిఆర్‌ఎస్‌లో చేరి కేంద్ర మంత్రి అయ్యారు.టిఆర్‌ఎస్‌లో నరేంద్ర తెలంగాణఅతివాదిగా, ఇతరులు మితవాదులుగాఉన్నారు. ఒకవేళ చంద్రశేఖరరావుతో పూర్తిగాచెడిపోతే విజయశాంతితో కలిసితెలంగాణ కోసం పోరాటం చేసే ఆలోచనఅయనకు ఉందని చెబుతున్నారు.

పిసిసిఅధ్యక్షుడు కే కేశవరావుపై కూడానరేంద్ర మండి పడ్డారు.కేశవరావు బిజెపితో మిలాఖత్‌ అయ్యారని ఆయన ఆరోపించారు.కేశవరావుది పచ్చి అవకాశవాదమని,ఆయన రాజకీయాలకు పనికి రారని నరేంద్రవ్యాఖ్యానించారు.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X