వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షారూక్‌కు దలైలామా ఆశీస్సులు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 30-07-2005

Vijayasanthiహైదరాబాద్‌:సినీనటి విజయశాంతి తెలంగాణ సాధనఉద్యమం ముందుకు సాగడం లేదు.తెలంగాణ రాష్ట్రం సాధించేందుకుప్రజలను సమాయత్తం చేస్తామనిచెప్పిన విజయశాంతి గత వారం రోజులుగావర్షాల కారణంగా ఇంట్లో నుంచి బయటకురావడం లేదు. మరోవైపు ఆమె చుట్టూ చేరిన వివిధపార్టీల నాయకులు క్రమంగా చల్లబడిపోయారు.మాజీ ఎంపీలు, ఎమ్మేల్యేలు కూడా ఆమె నాయకత్వంలోనిఉద్యమానికిఅండగా నిలిచినప్పుడు అది పెద్ద ఉద్యమంఅవుతుందని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ ఎక్కడో ఏదో లోపం వల్లతెలంగాణ రాములమ్మవెనుకబడిపోయింది.

అయితేవిజయశాంతిని తెలంగాణ మహిళకుప్రతీకగా భావించేవారు ఇంకాలేకపోలేదు. పాతబస్తీ బోనాల కమిటీ నాయకులు నిన్న విజయశాంతిని కలిసిబోనాలకు ప్రధాన అతిధిగా రావలసిందిగాకోరారు. సంప్రదాయ పద్ధతిలోఅమ్మవారికి విజయశాంతి పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించినవెండి కుండలో బోనం తాయారు చేసిఅమ్మవారికి సమర్పించనున్నారు. రేపుజరుగనున్న 97 వ బోనాల ఉత్సవంలోముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మంత్రులు గీతారెడ్డి, ఎంసత్యనారాయణ రావు, ఎంపీలు మధుయాష్కి గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు.

రాజకీయంగారాణించకుండా సాంస్కృతికకార్యక్రమాల్లో పాల్గొంటున్న విజయశాంతికిసినిమా రంగంలో కూడా చుక్కెదురవుతోంది.ఆమె నటించిననాయుడమ్మ సినిమా క్లెయిమాక్స్‌ చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు.సినిమానిర్మాణ బాగా ఆలస్యం కావడంతో నిర్మాతనిస్సహాయ స్ధితిలో పడిపోయారు. తన పారితోషికాన్ని పూర్తిగాచెల్లిస్తేనే క్లెయిమాక్స్‌ సన్నివేశాల్లో నటిస్తాననివిజయశాంతి తెగేసి చెప్పడంతో సినిమానిర్మాణం నిలిచిపోయింది. పారితోషికంతోనిమిత్తం లేకుండా నటిస్తానని, అయితేక్లెయిమాక్స్‌లో తన రాజకీయ ఉద్యమానికి సంబంధించినసన్నివేశాలుఉండాలని విజయశాంతి తాజాగా ప్రతిపాదించినట్టుతెలిసింది. ఆర్ధిక ఇబ్బందులతోసతమతమవుతున్న నిర్మాత ఎలాస్పందిస్తారో చూడాలి.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X