విజయశాంతిసొంత దుకాణం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు 31-10-2005
హైదరాబాద్:విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ త్వరలోప్రారంభం కానుంది. చంద్రశేఖరరావునాయకత్వంలోనిటిఆర్‌ఎస్ పార్టీ గత మునిసిపల్ ఎన్నికల్లోఘోర పరాజయం చవిచూసిననేపధ్యంలో విజయశాంతి సొంతపార్టీఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.బిజెపిలో ఉండగా స్క్రిప్టు రైటర్ రాసిందిరాసినట్టు బహిరంగ సభల్లోఅప్పచెప్పిన విజయశాంతి ఇప్పుడు కొంతరాటుదేలింది. తెలంగాణపై ఆమెకు నిర్ధిష్టఅభిప్రాయాలు ఏర్పడినట్టు కన్పిస్తోంది. దాదాపుమూడు ద శాబ్దాల పాటు చెన్నైలో ఉన్నవిజయశాంతికి రాజకీయ ఆవేశమైతేఉంది కానీ సిద్ధాంత బలం, ఆర్ధిక స్ధోమతలేవు. ఆనాటి ఎన్డీయే ప్రభుత్వం, భారతీయ జనతాపార్టీ ఆగ్రనాయకులు ఆమెను ఆర్ధికంగా ఆదుకున్నారు.ముఖ్యమైన పదవులు ఏమీ ఇవ్వకుండాఆమెతో ప్రచారం చేయించుకున్నారు.
విజయశాంతినిఇంతకాలం చాలా లైట్‌గా తీసుకున్నతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,కేంద్ర మంత్రి చంద్రశేఖరరావుఇప్పుడు సీరియస్‌గా తీసుకుంటున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో తమ బలంబయటపడడం, ఇప్పుడు కాంగ్రెస్‌అగ్రనాయకత్వం టిఆర్‌ఎస్‌ను లైట్‌గాతీసుకుంటున్న నేపధ్యంలో విజయశాంతితెలంగాణ కోటలో పాగా వేస్తుందేమోనన్నభయం చంద్రశేఖరరావుకు పట్టుకుంది.టిఆర్‌ఎస్‌నుంచి ఉద్వాసనకు గురైనసంతోష్‌రెడ్డి విజయశాంతితో చేతులుకలపాలను ఉవ్విళ్ళూరుతున్నారు. అయితేవిజయశాంతి సన్నిహితులు మాత్రం ఆయనతల్లి తెలంగాణపార్టీలో చేరకుండాఅడ్డుపడుతున్నారు.
నవంబర్‌మొదటి వారంలో విజయశాంతి ఆదిలాబాద్‌జిల్లాలో తల్లి తెలంగాణ పార్టీనిలాంఛనంగా ప్రారంభించనున్నారు.ఆమెకు తెలంగాణకు ఏమాత్రంసంబంధం లేదని, ఆమె పూర్వీకులుపశ్చిమ గోదావరి జిల్లా నుంచివచ్చివరంగల్ జిల్లాలో స్ధిరపడ్డారని చంద్రశేఖరరావుప్రచారం చేయాలకుంటున్నారు. చంద్రశేఖరరావుకు తెలంగాణరాష్ట్ర సాధనపై చిత్తశుద్ధిలేదని,ఆయన పదవీ వ్యామోహపరుడనివిజయశాంతి తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు. వీరిద్దరి మధ్యసంతోష్‌రెడ్డి రెంటికి చెడ్డరేవడిగా మారుతున్నారు. ఆయనతన మాతృసంస్ధ కాంగ్రెస్‌లో చేరక తప్పని పరిస్ధితులు ఉన్నాయి.
ఇటీవలికథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications