వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రియల్‌ ఎస్టేట్‌ ఢాం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే తెలుగుదేశం 22-11-2005

హైదరాబాద్‌:తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికిఅధికార కాంగ్రెస్‌పై దాడి చేయడానికిముఖ్యమైన అంశం ఏదీ దొరకడం లేదు.పరిటాల హత్య కేసును వైఎస్‌పై దాడికిఉపయోగించుకునే అవకాశమున్నాఆయన సద్వినియోగం చేసుకోలేక పోయారు.పరిటాల రవి హత్య జరిగిన వెంటనే వైఎస్‌ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడంతోనోరు మెదపడానికి తెలుగుదేశం నాయకులకుఅవకాశం లేకుండా పోయింది. రోగికోరింది,వైద్యుడు ఇచ్చింది ఒకటేనన్న చందంగాఆ వ్యవహారం ముగిసిపోయింది. సిబిఐ మాజీడైరెక్టర్‌ విజయరామారావు వంటివారు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, పరిటాలహత్యానంతర విచారణపై తెలుగుదేశంపార్టీ ముందు చూపుతో వ్యవహరించలేకపోయింది.

పరిటాలహత్య కేసు దర్యాప్తు వ్యవహారం చూస్తుంటేసిబిఐ వంటి అత్యున్నత సంస్ధ కూడా రాజకీయాలకుఅతీతమైనది కాదని అర్ధమవుతోంది.పరిటాల హత్య కేసులో నిందితులు తమంతటతాము ముందుకొచ్చి చెప్పిన విషయాలు తప్పసిబిఐ దర్యాప్తులో కొత్తగా ఒక్క విషయంకూడా తేలలేదు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుమరీ దారుణంగా హాస్యాస్పదంగా ఉంది. మొన్నమొద్దు సీను యాక్సిడెంటల్‌గా పోలీసులకుదొరికిన అనంతరం పోలీసుల వైఖరి మరీఅధ్వాన్నంగా ఉంది. మొద్దు సీను విషయంలోపోలీసు శాఖ కావాలని మొద్దు నిద్రపోతున్నట్టుస్పష్టమైంది. సిబిఐ దర్యాప్తుపై ఆశపెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి నిరాశేమిగిలింది. పరిటాల హత్య వెనుక బిగ్‌బాస్‌లు,గొప్ప వ్యూహం ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి.

పరిటాలహత్యను, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరినిప్రజల్లోకి పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగాతీసుకెళ్ళడంలో తెలుగుదేశం విఫలమైంది.నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టులకేటాయింపులో అవినీతిని ప్రజల ముందుకుటిడిపి తీసుకెళ్ళలేకపోయింది. కాంగ్రెస్‌అవినీతి విషయంలో అగ్రెసివ్‌గా పోతే, తనఅవినీతి గనులను ప్రభుత్వం ఎక్కడవెలికి తీస్తుందోనన్న భయం చంద్రబాబునాయుడికి ఉంది. సిబిఐ వైఖరిని కూడా ఆయన తీవ్రంగాపరిగణించకపోవడానికి కూడా ఇదే కారణం.అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకున్నఐటి రంగం గురించి చంద్రబాబు నాయుడుఅసలే మాట్లాడడం లేదు. ఇక రైతులగురించి ఆయన మాట్లాడడానికి ఏమీమిగల్లేదు. ఏమైనా మాట్లాడినా అది నెగిటివ్‌గామారుతుంది. అధికారంలో ఉన్నప్పుడుఆయన నేల విడిచి సాము చేయడంవల్లనే ఈ పరిస్ధితి ఏర్పడింది. అధికార పక్షంప్రధాన దోషాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళలేకపోతున్న,అధికారంలో ఉన్నప్పుడు తాము చేసినమంచి పనులకు చెప్పుకోలేని ప్రతిపక్ష పార్టీకిభవిష్యత్తు ఏమి ఉంటుంది?

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X