వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొందూ దొందేనా?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 13-12-2005

;?

హైదరాబాద్‌:పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లపై మంగళవారం అసెంబ్లీలో జరిగినచర్చప్రజల మనస్సుల్లో అనేక అనుమానాలురేకెత్తేలా చేసింది. జివికె, స్ప్రెక్టం,ల్యాంకో వంటి ప్రైవేటు విద్యుత్‌ సంస్ధలనుంచి ప్రభుత్వం కొంటున్న విద్యుత్‌రేట్లు అధికంగా ఉన్నాయన్న ఆరోపణలుఉన్నాయి. విద్యుత్‌ రంగంలోని అనేక మంది ప్రముఖులుకూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ఈసంస్ధల నుంచి పెద్ద ఎత్తున డబ్బుసంచులు తీసుకుని అధిక రేట్లు ఫిక్స్‌ చేయడమే గాక, మరో రెండున్నరఏళ్ళు ఆ అగ్రిమెంట్లను రద్దు చేయకుండాకమిట్‌ అయ్యారని విమర్శలు ఉన్నాయి. ఈవిషయంలో చంద్రబాబు నాయుడు, వైఎస్‌రాజశేఖరరెడ్డి తోడు దొంగల్లావ్యవహరిస్తున్నారని టిఆర్‌ఎస్‌సభ్యుడు విజయరామారావు నేడుఅసెంబ్లీలో చేసిన వ్యాఖ్య కాంగ్రెస్‌,తెలుగుదేశం శాసన సభ్యులనుమౌనంలో, ఆలోచనలో ముంచెత్తింది. చంద్రబాబునాయుడి మీద ఈ విషయంలోఆరోపణలు ఎటూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడులంచాల కోసం కుదుర్చుకున్న పవర్‌పర్చేజ్‌ అగ్రిమెంట్లను రద్దు చేస్తామనిఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినరాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఈవిషయంలో ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఆయన మీదకూడా అనుమానాలు కలుగుతున్నాయి.పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల మీద చర్చకునేడు స్పీకర్‌ అనుమతి ఇచ్చారు. రెండుగంటల పాటు విలువైన సభా సమయంగడిచిపోయినా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిఅసలు విషయం నుంచి వైదొలగిసంబంధం లేని విషయాలపై వాదప్రతివాదాలు చేసుకోవడంతో ఎమ్మెల్యేవిజయరామారావు మీ ఇద్దరినీ ప్రజలుదొంగల్లా చూస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబునాయుడు హయాంలో కుదుర్చుకున్నపవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లను తామురద్దు చేయడానికి వీలు లేకుండా ఉందని, ఆకంపెనీలు తెలుగుదేశం ప్రభుత్వంతోఅంత పక్కాగా ఒప్పందాలుఉ చేసుకున్నాయనిరాజశేఖరరెడ్డి ఇప్పుడు చావు కబురు చల్లగాచెబుతున్నారు. రాజకీయాల్లో మూడు దశాబ్దాల అనుభవం ఉన్నరాజశేఖరరెడ్డికి ఈ ఒప్పందాల స్వభావంఎన్నికల ముందు తెలియదనుకోవాలా?ప్రతిపక్షనాయకుడిగా ఈ ఒప్పందాలను చీల్చి చెండాడిన వైఎస్‌ ఆ ఒప్పందాలనుచదివిఉండరని మనం నమ్మాలా? కార్పొరేట్‌సంస్ధలు రాజకీయ నాయకులను,అధికారులను ప్రలోభ పెట్టి ఇటువంటిఒప్పందాలు చేసుకుంటాయని అందరికీతెలిసిందే. ఆ ఒప్పందాలను అసెంబ్లీలో చర్చకు పెట్టి, ఓటింగ్‌ జరిపిరద్దు చేసేటంత మంద బలం ఉన్న కాంగ్రెస్‌ప్రభుత్వం ఎందుకింత మందబుద్ధితో వ్యవహరిస్తోంది? దీనిమీదప్రభుత్వం పారదర్శకంగావ్యవహరించాలి. ఆ మూడు కంపెనీలతోకుదుర్చుకున్న ఒప్పందాలనుప్రభుత్వం ప్రజల ముందు ఉంచాల్సినఅవసరముంది.

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌సంస్ధకు చంద్రబాబు నాయుడుప్రభుత్వం దాదాపు వెయ్యికోట్ల రూపాయలవిలువైన ప్రభుత్వ భూమిని కారు చౌకగాకట్టబెట్టడంపై కూడా ఇటువంటి ఆరోపణలేవస్తున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడినితీవ్రంగా విమర్శించినకాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు మౌనంవహించడంలో మతలబు ఏమిటి?రాజశేఖరరెడ్డి ఇప్పుడు ఎమ్మార్‌ప్రాపర్టీస్‌ను సమర్ధిస్తూ మాట్లాడడంకొసమెరుపు. త్వరలో హైదరాబాద్‌లోజరుగనున్న ఏషియన్‌డెవలప్‌మెంట్‌ ఫోరం సమావేశాల నిర్వహణలో ఆ సంస్ధ సహకారంఅవసరమట. అందువల్ల ఆ సంస్ధకుకేటాయించిన ప్రభుత్వ భూముల జోలికి పోవడంలేదట. చంద్రబాబు నాయుడు మనిషిగా పేరున్న ఒక కాలమిస్ట్‌ ఇటీవలఒక విషయాన్ని స్పష్టంగా రాశారిలా-ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వారు చంద్రబాబు నాయుడికే కాదు రాజశేఖరరెడ్డికికూడ కావలసిన వారు. కాబట్టివారికిచ్చిన భూములను రద్దు చేసేఅవకాశం లేదు. ఎంత చక్కటి వ్యాఖ్యఇది. ప్రభుత్వాలు మారినా పరిస్ధితులు మారడంలేదనడానికి ఇంత కంటేవేరే దృష్టాంతం ఏమికావాలి? రోజుకుకడుపు నిండా తిండి దొరకని దురదృష్టవంతులు రెండుకోట్లమంది వరకు ఉన్న ఈ రాష్ట్రంలో ఏటా వేలాది కోట్లరూపాయల ప్రజాధనంతరలిపోవడం ఇంకా ఎంతకాలంకొనసాగాలి? కార్పొరేట్‌ సంస్ధలకు,కాంట్రాక్టర్లకు తెలుగుదేశం,కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సమానంగాఆదరిస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినావారికి నష్టం జరగడం లేదంటేతెర వెనుక ఏం జరుగుతోంది.అధికార, ప్రతిపక్ష సభ్యులు, ముఖ్యమంత్రి,మాజీ ముఖ్యమంత్రి పత్రికల్లోశాసనసభలో చేసుకుంటున్న ఆరోపణలు,తిట్టుకుంటున్న తిట్లు ఉత్తుత్తివేనా?

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X