వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాదు:విద్యా సాగర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌నాయకులు మాటల తీరు గమనిస్తుంటేతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చే అవకాశంలేదనికేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకుడుసి.హెచ్‌. విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు.పిసిసి అధ్యక్షుడు కె.కేశవరావు,కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు వెంకటస్వామి,ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జె.సి.దివాకర్‌రావుతదితరులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంవిషయంపై పలురకాల వాఖ్యలు చేస్తున్నారన్నారు.వీటిని పరిశీలించినట్టయితే తెలంగాణ ఏర్పాటుసాధ్యమయ్యే సూచనలు కనుచూపుమేరలో కనిపించడం లేదని ఆయనఅభిప్రాయపడ్డారు.

విదర్భ, హరితప్రదేశ్‌లతోపాటే తెలంగాణకు వస్తుందని మరి కొందరుమాట్లాడే తీరును ఆయన దుయ్యబట్టారు.తెలంగాణ వచ్చే సంగతి పక్కనబెట్టిముందుగా ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చడానికిఅవసరమైన చర్యలు చేపట్టాలనిశనివారంనాడిక్కడ జరిగిన విలేకరులసమావేశంలో ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. తెలంగాణ ఉద్యోగులకు మేలు చేకూర్చేగిర్‌గ్లాని నివేదికను అమలు చేయాలన్నారు.అలాగే తెలంగాణకు ప్రాణాధారమైన గోదావరిజలాలను ప్రతి పల్లెకు అందించడానికి అవసరమైనచర్యలు చేట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.కరువు, ఆత్మహత్యలను నిరోధించడానికిఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలన్నారు.

గతంలో 16 ఆణాల పార్టీగాపేరున్న తెలంగాణ ప్రజా సమితి 16 మందిఎంపిలతో ప్రత్యేక తెలంగాణ తీసుకువస్తామనిగాంభీర్యాలు పలికి చివరకు చేతులెత్తేసిందనిఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తెలంగాణసాధిస్తామని చెప్పుకుంటున్న టిఆర్‌ఎస్‌ పార్టీఎన్నికల ముందే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునిఆ పార్టీ చెప్పినట్టు చేస్తోందన్నారు.కాంగ్రెస్‌లోవిలీనం కావాలని టిఆర్‌ఎస్‌కు ఉన్నప్పుడు ఇకతెలంగాణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.ఈరెండు పార్టీల విలీనం తెలంగాణకు ప్రమాదమనిఆయన హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటుకుబిజెపి ఎల్లప్పుడూ ఒకే మాట చెబుతుందని ,తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి బిజెపి అనుకూలంగానేఉందని విలేకరుల ప్రశ్నకు ఆయనసమాధానంగా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X