• search

ఇది పరిపాలనా?పరపాలనా?

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 21-03-2005

  ఇది పరిపాలనా?పరపాలనా?

  రాష్ట్రప్రభుత్వానికి-మావోయిస్టులకు మధ్యదోబూచులాటలు ఒక కథను గుర్తుకుతెస్తున్నాయి.

  YSRఅనగనగాఒక వూళ్ళో మద్దిలేటి అనే రైతు ఉండేవాడు.అతని కొడుకు సోము ఒకరోజు ఆటలాడుకుంటూపాము తోక మీద కాలు వేశాడు. ఆ నాగుపాముబుస్సుమని ఇంతెత్తున లేచి కుర్రాడినికాటేసింది. కొడుకు చనిపోవడంతో మద్దిలేటిరోదించాడు. అక్కడే పొదలో దూరిన ఆ పాముబయటకు వచ్చేలా చేశాడు. గొడ్డలితో దానితల మీద కొట్టబోగా వేటు తోక మీద పడింది.తోక తెగినా పాము పుట్టలోకి పారిపోయింది.
  పగబట్టినఆ పాము మరునాడు మద్దిలేటి పశువులకొట్టంలో దూరి పశువులను కాటేసింది.పాము వల్ల ఆ రైతు అనేక విధాలుగానష్టపోయాడు. బాగా ఆలోచించిన అతనుపామును మంచి చేసుకోవలని నిర్ణయించుకుంటాడు.ఒకరోజు పుట్ట వద్దకు వెళ్ళి గుడ్లు,తేనె అక్కడ ఉంచుతాడు. నాగరాజా! జరిగినదంతామర్చిపోదాం. ఒకరినొకరు క్షమించుకుందాం.నా కొడుకును నువ్వు శిక్షించడంసబబే కావచ్చు. నీ తోక తెగ్గొట్టినందుకునువ్వు నా పశువులను కాటేయడంసముచితమే కావచ్చు. మొత్తమ్మీదనాకూ నష్టం జరిగింది. నీకూ నష్టం జరిగింది. అన్నీమర్చిపోయి మనం మళ్ళీ స్నేహితులుగాఉండొచ్చు కదా? అని మద్దిలేటి మొరపెట్టుకున్నాడు.
  అలా కుదరదుఅని పాము నిక్కచ్చిగా చెప్పింది. నీ బహుమతులుతీసుకెళ్ళిపో. నీ కొడుకు మరణాన్ని నువ్వుమర్చి పోలేవు. నా తోక తెగిపోవడాన్నినేను మరువలేనుఅని చెప్పి పుట్టలోకి వెళ్ళిపోయింది.

  ప్రఖ్యాతగ్రీకు రచయిత కొన్ని వేల ఏళ్ళనాడుచెప్పిన నీతి కథ ఇది. నీతి ఏమిటంటేగాయపరిచిన వారిని క్షమించవచ్చు కానీగాయం కలిగించిన బాధను మర్చిపోలేం.

  ఇప్పుడుమావోయిస్టులకు ప్రభుత్వానికిమధ్య చర్చలు- కాల్పుల వ్యవహారంచూస్తుంటే ఈ కథ గుర్తుకు వస్తోంది.మావోయిస్టులతో మరోసారి చర్చలుజరుగుతాయని ఒకరోజు, మావోయిస్టులపైనిషేధం విధిస్తామని మరో రోజు, చర్చలకునిషేధానికి సంబంధం లేదని, నిషేధంఉన్నా చర్చలు జరపవచ్చని ఇంకో రోజుహోంమంత్రి జానారెడ్డి ముద్దముద్దగా చెబుతున్నారు. ప్రభుత్వవిధానమేమిటో అర్ధం కాదు. స్పష్టతవిషయంలో మావోయిస్టులే మెరుగ్గాఉన్నారు. అయినా రెండు పరస్పరవిరుద్ధ ధోరణులు గల పక్షాల మధ్యచర్చలు ఎలా ఫలిస్తాయి? ఇది కేవలంకాలయాపన.

  ఈలోపు ఉభయపక్షాలు నెత్తురోడుతున్నాయి. ప్రతిరోజూనక్సలైట్ల హింస, పోలీసు కాల్పులు,ఇన్‌ఫార్మరల పేరిట హత్యాకాండనిత్యకృత్యమైపోయింది. చంద్రబాబునాయుడు ప్రజావ్యతిరేక విధానాలనుఅనుసరిస్తున్నారని ఆయనను హిట్‌లిస్టులోపెట్టిన మావోయిస్టులు ఆనాడు బాబు కంటేఎవరైనా బెటర్‌ అనుకున్నారు. ఇప్పుడువైఎస్‌ కంటే చంద్రబాబు నాయుడేనయం అంటున్నారు. పాలకుల మైండ్‌సెట్‌,పంథా ఒకేవిధంగా ఉంటాయన్న సత్యంగతితార్కిక భౌతికవాదులైనమావోయిస్టులకు తెలియదా? మావోయిస్టులమీదికి పోలీసులను రెచ్చగొడుతున్నప్రభుత్వానికి శాంతి చర్చలుఫలించవన్న వాస్తవం తెలియదా?

  క్రిస్టియన్‌కుటుంబంలో పుట్టిన సోనియాగాంధీనక్సలైట్లతో చర్చలు జరుగుతున్నసమయంలో ఎంతో సంతోషించారని, ఇప్పుడురక్తపుటేరులు పారడంపై ఆవేదనచెందుతున్నారని, సోనియాగాంధీహైదరాబాద్‌ వచ్చినప్పుడు మావోయిస్టుప్రతినిధులకు ఆమెతో సమావేశం ఏర్పాటుచేయిస్తామని తెలంగాణకు చెందినకాంగ్రెస్‌ నాయకులు ఫీలర్లు వదిలారు.సోనియాగాంధీకి శాంతి కాంక్షఉండవచ్చు. కానీ ఆమె కూడా ఆ తానులోముక్కే కదా? మావోయిస్టుల హింసాకాండవల్ల అధికార యంత్రాంగంనిర్వీర్యమైపోతోందని, ఇలాగే కొనసాగితేరాష్ట్రంలో అరాచకంఏర్పడుతుందన్న వాదనను రాష్ట్రప్రభుత్వం సోనియాగాంధీ ఎదుటఉంచలేదని ఎలా అనుకోగలం? శాంతి కావాలనిఎవరైనా కోరుకుంటారు. కానీ అదిసాధ్యమయ్యే మార్గమేది? ఎన్నికలముందు ప్రజలకు సవాలక్ష వాగ్దానాలుచేసిన వైఎస్‌ ప్రభుత్వం ప్రతి క్షణంభయం మధ్య వాటినినేరవేర్చుకోడానికి ఎలామనసుపెట్టగలదు?

  Recent Stories

  ఢిల్లీ పిలుపు ఒకమలుపు!
  చేతులెత్తేస్తున్నప్రభుత్వం
  వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
  కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
  కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
  ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
  పవర్‌ ప్లస్‌ పవర్‌
  సమాంతర శక్తులు!
  ఇందిరమ్మ భూమి
  ఇదొక రాజ్యకీయం.
  అవినీతి వికేంద్రీకరణ
  కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
  సోదరహాసం

  వైఎస్‌ అసహనం
  కప్పల తక్కెడ
  మూడో పవర్‌ఫుల్‌ లేడీ
  టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి
  బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
  మంద భాగ్యనగరం
  తెలంగాణకు ఎర్ర జెండా
  ఛానళ్ళా? చేపల చెరువులా?
  టిఆర్‌ఎస్‌లో ముసలం?
  వార్‌ బహుముఖ విస్తరణ
  ఎమ్యెల్యేకుకోటి!
  ప్రత్యేక వ్యూహం!
  ఐటీ మీద వైఎస్‌ దృష్టి హోంపేజి

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more