చిరంజీవి పార్టీ- కుల స్పృహbrఒక ఫోకస్ అనేది లేకుండా చిరంజీవి పార్టీ నిర్మాణం సాగిపోతోంది....

చిరంజీవి పార్టీకి కాపు/ మున్నూరు కాపు/తూర్పు కాపు/తెలగ/బలిజ/ఒంటరి కులాల వారు కట్టగట్టుకుని ఓటు వేస్తారన్నది చిరంజీవి శిబిరం మేధావుల అంచనా. అయితే రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కాపులకు, దాని ఉప కులాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినందువల్ల ఈ వర్గాల్లో కొంత శాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. ఈ విషయంలో చిరంజీవికి కూడా స్పష్టత ఉందని చెబుతున్నారు.
చిరంజీవిని కాపు కులానికి మాత్రమే పరిమితం చేసేలాగా రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన మేధావులు, సీనియర్ నాయకులు చాప కింద నీరులా ప్రచారం చేస్తున్నారు. ఈ సందేశం ఇప్పటికే కోస్తా ఆంధ్రలో కాపులను వ్యతిరేకించే యాదవ, శెట్టి బలిజ (గౌడ్), పద్మశాలి, మత్స్యకార వంటి బిసీ కులాలకు అందినట్టు సామాజిక అధ్యయన నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కోస్తా జిల్లాల్లో కూడా చిరంజీవి పార్టీకి అన్నుకున్న స్ధాయిలో సీట్లు వచ్చే అవకాశాలు లేనట్టే.
చిరంజీవి పార్టీతో అతి సన్నిహితంగా ఉంటున్న చేగొండి హరిరామ జోగయ్య, కోటగిరి విద్యాధరరావు, ఆదికేశవులు నాయుడు వంటి వారు ఎవరూ వెనుకబడిన కులాలకు చెందిన వారు కాదు. రాష్ట్రంలో వెనుకబడిన కులాల (40 కులాల వరకు ఉన్నాయి) జనాభా యాభై శాతానికి పైగా ఉంటుంది. ఈ వర్గాలను ఆకట్టుకోవడంలో ఆనాడు ఎన్టీఆర్ విజయవంతమయ్యారు. ఇప్పుడు చిరంజీవి చుట్టూ ఉన్న మేధావులకు ఈ విషయంలో పెద్ద అవగాహన ఉన్నట్టు కన్పించడం లేదు.












Click it and Unblock the Notifications