కేంద్రమంత్రి పదవిపై కన్ను!

తమకొచ్చే ఐదారు స్ధానాలతో తనకు కేంద్రమంత్రి పదవి వచ్చేలా చూసుకోవాలని అల్లు అరవింద్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆరేడు స్ధానాలు వస్తాయని భావిస్తున్న టీఅర్ ఎస్ ఎన్డీయేకు మద్దతు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో సహాయ మంత్రి కాకుండా కేబినెట్ మంత్రి పదవి చేపట్టాలని అరవింద్ ఉవ్విళ్ళూరుతున్నారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టినా నిర్మాతగా కొనసాగాలని అరవింద్ ఆకాంక్ష. బినామీలను పెట్టి సినిమా నిర్మాణరంగంలో ఆయన కొనసాగవచ్చు.
ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ పుణె వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీలో అల్లు అరవింద్ డామినేషన్ ఎక్కువ కావడం పవన్ కు ఇష్టం లేదని చెబుతున్నారు. కానీ ఏమైనా అంటే అన్నయ్య బాధపడతాడేమోనని ఆయన తనలో తానే మధన పడుతున్నారు. ఆయన ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు హైదరాబాద్ కు తిరిగి వస్తారు. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన నాగబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజారాజ్యం తరఫున అల్లు అరవిందే చక్రం తిప్పనున్నారు.












Click it and Unblock the Notifications