వైఎస్ కు డిఎస్ ఎసరు?

అయితే ఈసారి కాంగ్రెస్ గెలిచినా వైఎస్ కు అవకాశం ఇవ్వకూడదని, వీలుంటే డిఎస్ కు పట్టం కట్టాలని కాంగ్రెస్ హై కమాండ్ యోచిస్తున్నట్టు డిఎస్ శిబిరంలో ఒక మసాలా వార్త ప్రచారంలో ఉంది. మరోసారి వైఎస్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఆయన హై కమాండ్ కు ఏకు మేకు అవుతారని అనుమానం ఉంది. అదీగాక వైఎస్ ఇందిరా కాంగ్రెస్ ను విడిచిపెట్టి తన మనుషులతో వైఎస్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన ప్రత్యర్ధులు ఇప్పటికే హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపధ్యంలో హై కమాండ్ కు, ముఖ్యంగా సోనియాగాంధీకి వీర విధేయుడైన డి శ్రీనివాస్ రహస్యంగా పావులు కదుపుతున్నారు. తాను నిజామాబాద్ జిల్లాకు మాత్రమే నాయకుడిని కానని, తాను రాష్ట్రం మొత్తానికి నాయకుడినని నేడు శ్రీనివాస్ అనడం మారిన పరిస్ధితులకు ఒక సంకేతం. గత ఎన్నికల సమయంలో కూడా శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. వైఎస్ లాబీయింగ్ కారణంగా ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. రెండోసారి పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టినప్పుడు సోనియాగాంధీ " ఈసారి నువ్వే ముఖ్యమంత్రివి" అని హామీ ఇచ్చినట్టు డిఎస్ సన్నిహితులు చెప్పుకుంటున్నారు. టికెట్ల కేటాయింపులో వైఎస్ మాటను కాదనకుండా డిఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హై కమాండ్ కు ఆయన మీద సదభిప్రాయం ఉంది. వైఎస్ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం వల్ల హై కమాండ్ మరో వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్టు కన్పిస్తోంది.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిక - కేసీఆర్ హామీతో..!? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications