వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు 'మహా' ముప్పు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి మహా ముప్పు పొంచి ఉంది. మహా కూటమి ఏర్పాటుతో దాదాపు 60 శాసనసభా సీట్లను సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లకు తెలుగుదేశం పార్టీ కేటాయించాల్సి వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 75 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మిత్రపక్షాలకు ఇచ్చారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో తెరాసకు కేటాయించిన 43 స్థానాలు కూడా తెలంగాణలోనివే. వాపక్షాలకు కూడా ఎక్కువగా తెలంగాణలోనే స్థానాలను కేటాయించాల్సి వచ్చింది. అలాగే తెలంగాణలో 11 లోకసభ స్థానాలను సిపిఐ, సిపిఎం, తెరాసలకు కేటాయించారు. సిపిఐకి నల్లగొండ, సిపిఎంకు భువనగరి సీటును కేటాయించారు. తెరాసకు 9 లోకసభ స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది.

తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న వరంగల్ వంటి లోకసభ సీట్లు తెరాసకు వెళ్లడంతో ఆ పార్టీలో తీవ్ర అసమ్మతి పెల్లుబుకుతోంది. తెలుగుదేశం పార్టీలో స్థానిక తీవ్ర నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాదు జిల్లాలో అసమ్మతి వీధికెక్కింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు.మహబూబ్ నగర్, అచ్చంపేట శాసనసభా స్థానాలను తెరాసకు కేటాయించడంతో ఆ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే మాజీ శాసనసభ్యుడు శ్రీపతి రాజేశ్వర్ సనత్ నగర్ సీటు దక్కకపోడంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. సనత్ నగర్ సీటు నుంచి తెరాస మాజీ శాసనసభ్యుడు టి. పద్మారావు పోటీ చేస్తున్నారు. గతంలో శ్రీపతి రాజేశ్వర్ సనత్ నగర్ సీటు నుంచి శాసనసభకు గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు.

ఇదిలావుంటే, మహా కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరుగుతుందా, లేదా అనే అనుమానం కూడా చంద్రబాబును పీడిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీకి తెరాస ఓట్లు పడతాయా, లేదా అనేది అనుమానం. అలాగే, పైగా తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిత్రపక్షాలకు ఓట్లు వేస్తారా అనేది కూడా అనుమానమే. నిజానికి, తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. మిత్రపక్షాలకు అత్యధిక స్థానాలు తెలంగాణలోనే కేటాయించడం వల్ల తెలుగదేశం పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాంగ్రెసు పార్టీని మట్టి కరిపించే ఉద్దేశంతో ఏర్పాటైన మహా కూటమి వల్ల తెలుదుగుదేశం పార్టీకి మొదటికే మోసం వస్తుందా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం.

అలాగే, సీట్ల విషయంలో వామపక్షాలకు, తెరాసలకు మధ్య కూడా పొంత కుదరడం లేదు. తెరాస అడిగిన కొన్ని సీట్ల కోసం వామపక్షాలు పట్టుబడుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని తెరాసకు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సీటును సిపిఎం అడుగుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారైందని, తమకు తెలుగుదేశం పార్టీ 16 సీట్లు కేటాయించిందని వచ్చిన వార్తలను సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు మెలిక పెట్టారు. సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదని, తమకు 20 శాసనసభా స్థానాలు కేటాయించాలని ఆయన అంటున్నారు. ఆ 20 శాసనసభా స్థానాల జాబితాను ఆయన మీడియాకు అందజేశారు. తెరాసతో పొత్తుతో సీట్ల సర్దుబాటు కొలికి వచ్చి అంతా సజావుగా జరిగిందని భావిస్తున్న తరుణంలో చంద్రబాబుకు ఈ తాజా పరిణామం తలనొప్పిగా మారింది.

ఇదిలా వుంటే, మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న సిపిఎం ఓట్లు తెరాసకు పడ్తాయా అనే సందేహాలు కూడా లేకపోలేదు. అలాగే, తెలంగాణ జాతీయాంశం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఇటీవల ఒక మెలిక పెట్టారు. దీంతో తెరాసకు, వామపక్షాలకు మధ్య ఓట్ల బదిలీపై అనుమానాలు పొడసూడచడం సహజం. మొత్తం మీద, చంద్రబాబుకు మహా కూటమితో పెద్ద ప్రమాదమే పొంచి ఉందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X