హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్లైమాక్స్ లో చిరు 'సినిమా'!

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవిలో ఆలస్యంగా రాజకీయ పరిణతి కొద్ది కొద్దిగా కనిపిస్తోంది. సమాజానికి ఏదో మంచి చేయాలని తాను తాపత్రయ పడుతున్నట్టు ఒక సందేశాన్ని అయితే ఆయన జనానికి ఇన్ని నెలల కాలంలో ఇవ్వగలిగారు. చిరంజీవి మంచివాడన్న అభిప్రాయం జనంలో కొనసాగేలా చూసుకోగలిగారు. కొత్తలో వారం రోజుల పర్యటనలకే నడుం నొప్పి, గొంతు నొప్పి వచ్చి పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగ వచ్చి విశ్రాంతి తీసుకున్నా, ఆయన పట్టుదలతో తన రాజకీయ యాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎండలకు, శ్రమకు తట్టుకోగలిగిన విధంగా తనను తాను మలుచుకోగలిగారు.

కానీ ప్రజారాజ్యం పార్టీ సంస్ధాగత వ్యవహారాలు ఆందోళనకరంగా ఉన్నాయి. టికెట్లు ఆశించేవారిని షార్ట్ లిస్ట్ చేసి అల్లు అరవింద్ వద్దకు పంపిస్తున్నారు. ఆయన పార్టీ ఫండ్ గా ఎంత ఇస్తావు, సొంతంగా ప్రచారానికి ఎంత ఖర్చు చేసుకోగలవు అని అడుగుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, పవన్ ఎండల్లో జనంలోకి వెళ్ళి కష్టపడుతుండగా అల్లు అరవింద్ ప్రజారాజ్యం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ, టేబుల్ ప్రాఫిట్ కోసం ఆశిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రజారాజ్యం టికెట్ కోసం ముందే రెండు కోట్లు వదిలించుకున్న కేసినేని నాని ఆ పార్టీ వ్యవహారాలతో విసిగిపోయి కొన్ని రోజుల్లోనే రాజీనామా చేసి ఈ నెల 9న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆ రోజున ఆయన ప్రజారాజ్యంలోని మరికొన్ని లొసుగులను బయటపెట్టే అవకాశాలున్నాయి.

మొదట్లో పాజిటివ్ రాజకీయాలంటూ ఎంవరినీ పల్లెత్తు మాట అనని చిరంజీవి ఇప్పుడు వైఎస్ ను, బాబును, కెసీఅను రఫ్ ఆడిస్తున్నారు. తొలుత సాఫ్ట్ గా ఉన్న చిరంజీవి ఇప్పుడు రఫ్ గా మారడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆయన మీద తీవ్ర స్ధాయిలో దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాయి. తిరుపతి నుంచే కాక తెలంగాణ లోని ఒక అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేస్తానని చిరంజీవి నేడు ఆదిలాబాద్ పర్యటనలో ప్రకటించడంతో కెసీఆర్ చిరు మీద భారీ వ్యాఖ్యలు చేయబోతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X