రాజకీయ వ్యూహంలో బాబు కంటే చిరంజీవి బెటరా?

రాష్ట్ర అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయారు. ఆయన పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తామని హెచ్చరించడాన్ని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్టీ రామారావు తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్ధలను పటాపంచలు చేయడంతో బిసి, ఎస్ సి, ఎస్ టి లు తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా మారారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు ఊగిసలాట ధోరణి ఆ పార్టీకి చెందిన ప్రాంతీయ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.
చిరంజీవి స్పష్టంగా సమైక్యాంధ్ర వైఖరి తీసుకుని కోస్తాలో, రాయలసీమలో పర్యటించడం ప్రజారాజ్యం పార్టీకు ప్లస్ గా మారింది. జగన్ కూడా సమైక్యాంధ్ర వాది అయినా కాంగ్రెస్ హై కమాండ్ నుంచి ఆయనకు అనుకూలంగా ఎటువంటి సంకేతాలు రావడం లేదు. చిరంజీవి ముందడుగు వేయడం కోస్తా, సీమల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆ 30 శాతమో, 25 శాతమో పదిలం. కొత్త ఓటర్లు, చదువుకున్న వారు, తటస్ధులు టిడిపికి ఓటు వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ చంక్ అంతా చిరంజీవి ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపే అవకాశముంది.












Click it and Unblock the Notifications