చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆదాయం వెల్లడించని చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తన ఆదాయపు పన్ను వివరాలను బహిర్గతం చేయడానికి చిరంజీవి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను వివరాలను బహిర్గత పరచడానికి మీకున్న అభ్యంతరాలు ఏమిటని చెన్నై ఆదాయపు పన్ను శాఖ ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి లేఖ పంపింది. జనవరి 13వ తేదీతో వెళ్ళిన ఆలేఖలో చిరంజీవి జవాబు ఇవ్వడానికి వారం రోజుల గడువు ఇచ్చింది.

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె సూర్యప్రకాశరావు సమాచార హక్కు చట్టం కింద చిరంజీవి ఆదాయపు పన్ను వివరాలను కోరారు. చిరంజీవి హైదరాబాద్ కు మకాం మార్చి పదిహేనేళ్ళు అయినా ఆయన ఇప్పటికీ చెన్నైలోనే ఇన్ కంటాక్స్ రిటర్న్ లను దాఖలు చేస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఆ వ్యక్తి ఆమోదం పొందకుండా వెల్లడించకూడదన్న నిబంధన ఉండడంతో ఆదాయపు పన్ను శాఖ చిరంజీవికి లేఖ రాయవలసి వచ్చింది.

చిరంజీవి అక్టోబర్ 15 వ తేదీన విశాఖపట్నంలో మాట్లాడుతూ తన ఆదాయపు పన్ను, ఖర్చులు, ఇతర ఆర్ధిక లావాదేవీలు ఖచ్చితంగా ఉన్నాయని, ఎవరైనా ఆ వివరాలు తెలుసుకోవచ్చని చేసిన ప్రకటనను గోనె సూర్యప్రకాశరావు తన దరఖాస్తులో ప్రస్తావించారు. ఆ మాటకు చిరంజీవి కట్టుబడి ఉంటారా అని ఆయన ప్రశ్నించారు.

చిరంజీవి ఎన్ని సినిమాల్లో నటించారు? ఎంత పారితోషికం తీసుకున్నట్టు రిటర్న్ లు దాఖలు చేశారు అనే వివరాలను సమాచార హక్కు చట్టం కింద గోనె ప్రకాశరావు కోరారు. ఎన్నేళ్ళ నుంచి చిరంజీవి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు? ముప్పై ఏళ్ళుగా చిరంజీవి సంపాదించుకున్న ఆస్ధులు ఎంత? గత ముప్పై ఏళ్ళుగా చిరంజీవికి పారితోషికాలు ఇచ్చిన నిర్మాతల ఆదాయపు పన్ను వివరాలేమిటి? అని గోనె తన దరఖాస్తులో అభ్యర్ధించారు.

అయితే చిరంజీవి తన ఆదాయపు పన్ను, ఆస్ధి వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. సమాచార హక్కు చట్టం సబ్ సెక్షన్ (3) కింద ఇరవై ఏళ్ళ క్రితం నాటి సమాచారం వెల్లడించాల్సిన అవసరం లేదని ఆయన లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. అటువంటి సమాచారం ఎందుకు కావాలో దరఖాస్తుదారుడు సరైన కారణం చూపించలేదని చిరంజీవి పేర్కొన్నారు. దీనిపై చెన్నై ఆదాయపు పన్ను శాఖ సమాచార అధికారులు స్పందిస్తూ గోనె ప్రకాశరావు దరఖాస్తును తిరస్కరించినట్టు వెల్లడించారు. అయితే ఆదాయపు పన్నుశాఖ అదనపు కమిషనర్ కు అప్పీలు చేసుకోవచ్చని సూచించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X