ఎన్టీఆర్ కుటుంబంలో ముసలం?

చంద్రబాబు నాయుడు చాలా టక్కరి నక్క అని గతంలో తన మిత్రుల వద్ద వ్యాఖ్యానించిన హరికృష్ణ ఇప్పుడు మళ్ళీ ఆ వ్యాఖ్యానాన్ని బహిరంగంగా చెప్పుకోవలసిన పరిస్ధితులు దాపురించాయి. అయితే ఇంటి గుట్టు గడప దాటకూడదనే పాలసీ హరికృష్ణది. ఎన్ని సమస్యలు వచ్చినా కడుపులో దాచుకోవడం, శరీరం తూలినా, మనసును తూలినివ్వకపోవడం ఆయన ప్రత్యేకత. ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆయనే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ లో వెలిగిపోతున్న పురంధరేశ్వరి కావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి----మొత్తంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యుల ఉన్నతి కావాలి. ఆయన దృష్టిలో సామాన్య జనం ఎన్టీఆర్ కుటుంబానికి అభిమానులు. వాళ్ళకి ఆశలు ఉండకూడదు. భవిష్యత్తు ఉండకూడదు.
చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కువగా బాలకృష్ణ మీద, జూనియర్ ఎన్టీఆర్ మీద ఆధారపడుతున్నారు. బాలకృష్ణ తన వియ్యంకుడు కావడంతో ఇద్దరికీ మంచి అవగాహన ఉంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సేఫ్. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు చేరదేశారు. జూనియర్ ను ఎన్టీఆర్ కుటుంబం సొంత మనిషిగా చూడడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. దానితో హరికృష్ణని పరోక్షంగా దెబ్బతీయడానికి చంద్రబాబు జూనియర్ ను వాడుకుంటున్నారన్నది ఆరోపణ. ఎన్నికల లోపు అన్ని విషయాలు బయట పడతాయి. కానీ ఎన్టీఆర్ కుటుంబం గుట్టు గడపదాటకపోవచ్చు. ఈలోపు ఎన్నో రాజీలు జరగవచ్చు.












Click it and Unblock the Notifications