జూనియర్ కు తండ్రే విలనా?

జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆయనను తెలుగుదేశం ప్రచారానికి ఉపయోగించాలనుకున్నారు. "నన్ను హారతి పెట్టి నందమూరి వారసుడిగా ప్రకటించి ఆహ్వానిస్తేనే ఒప్పుకుంటా" అని జూనియర్ ఒక గట్టి షరతు పెట్టాడు. దానికి అప్పట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో గుంటూరులో జరిగిన యువగర్జనకు జూనియర్ హాజరు కాలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఫాలో అప్ చేయగా, చేయగా మూడు నాలుగు రోజులైతే ప్రచారం చేస్తానని జూనియర్ చెప్పాడు. అయితే ఎన్టీఆర్ రోడ్ షోలకు అశేష జనవాహిని తరలి వస్తుండడంతో "కుటుంబంలో నీ స్టేటస్ సంగతి నేను చూసుకుంటా, నువ్వు నీ రోడ్ షోలను కొనసాగించు" అని చంద్రబాబు నాయుడు ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. జూనియర్ తల్లీకి కూడా ఫోన్ చేసి చంద్రబాబు ఈ విషయం చెప్పారట.
ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. తననూ నందమూరి వారసుడిగా గుర్తించాలని జూనియర్ పట్టుబడుతున్నా కన్నతండ్రి హరికృష్ణ కనికరం చూపకపోవడం. మొదటి భార్య పిల్లల నుంచి ఓత్తిడి రావడం వల్లనే హరికృష్ణ అందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఆ పిల్లలకు, హరికృష్ణకు మధ్య ప్రొఫెషనల్ రైవలరీ యే ప్రధాన కారణం కావచ్చు. జూనియర్ ఎంతో కష్టపడి తారాజువ్వలా హీరోగా అగ్రపథానికి చేరుకున్నాడు. అతను నందమూరి హీరోలలో బాలకృష్ణను కూడా దాటిపోయాడు. ఆ విజయం జూనియర్ కు ఎంతో ఆత్మ విశ్వాసం కలిగించింది. కానీ ఆయన కుటుంబంలోని ప్రత్యర్ధులకు అది రుచించలేదు.
యాక్సిడెంట్ అయి జూనియర్ ఎన్టీఆర్ కిమ్స్ లో ఉన్నప్పుడు తండ్రి హరికృష్ణ అందరికంటే ఆలస్యంగా ఎందుకు వచ్చినట్టు? హరికృష్ణ ఎవరి ఒత్తిళ్ళకు లొంగుతున్నట్టు? బహుభార్యలను కలిగి ఉన్న ఆయన ప్రజలకు ప్రజాప్రతినిధిగా ఇచ్చే సందేశమేమిటి? జూనియర్ ఎన్టీఆర్ వంటి వజ్రాన్ని కని కూడా ఆయన కులాల పట్టింపులను పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? అతి త్వరగా ఆ చిన్నవాడి చిన్న కోరిక "అదే నందమూరి కుటుంబంలో ఒకడు కావాలన్నది" నేరవేర్చడం సమంజసం.












Click it and Unblock the Notifications