ఏదో తేల్చుకోవడానికే...

KVP Ramachandar Rao
తన ఆత్మీయ మిత్రుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కెవిపి రామచందర్ రావు చివరి యత్నానికి దిగారు. ఆయన శనివారం ఢిల్లీ వెళ్లారు. లాబీయింగ్ ద్వారా అధిష్ఠాన వర్గాన్ని ఒప్పించి వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది ఆయన ప్రయత్నమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదని తెలుస్తోంది. నష్టనివారణ చర్యలకే ఎక్కువ సమయం పట్టిందని తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయక ముందే వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రచారం ఊపందుకోవడం, మంత్రులు రాజీనామా చేస్తామని బెదిరించడం తదితర పరిణామాలు అధిష్ఠాన వర్గం వద్ద జగన్ కు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా పని చేసినట్లు తెలుస్తోంది. కెవిపి రామచందర్ రావు శుక్రవారం రాత్రి మంత్రులతో అన్న మాటలు ఆ విషయాన్నే తెలియజేస్తున్నాయి.

ఇప్పటికే పార్టీ అధిష్ఠాన వర్గం వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అనుకూలంగా లేనట్లు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి కాకుండా ఇతర పదవులు ఆశ చూపినట్లు కూడా వార్తలు వచ్చాయి. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవిని జగన్ వర్గీయుల తోసిపుచ్చినట్లు కూడా సమాచారం. ఈ స్థితిలో చివరి ప్రయత్నంగా అధిష్ఠానవర్గాన్ని ఒప్పించేందుకు కెవిపి ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు.

కెవిపి రామచందర్ రావు మరోసారి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశం ఉంది. ప్రణబ్, కాంగ్రెసు అధికార ప్రతినిధి మనీష్ తివారీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు కెవిపిని ఆందోళనకు గురి చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నేతను ఎన్నుకోవడానికి ఇంకా సమయం ఉందని, ఈ విషయంలో తొందరేమీ లేదని ప్రణబ్ అనగా ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులున్నారని మనీష్ తివారీ అన్నారు. అలా ప్రకటనలు రావడం వెనక గల కారణాలేమిటో కెవిపికి అంతం పట్టడం లేదని అంటున్నారు. దీన్ని బట్టి ఇప్పుడిప్పుడే నాయకత్వ విషయాన్ని తేల్చడానికి సిద్ధంగా లేరని అర్థమవుతోందని భావిస్తున్నారు. అయితే, కెవిపి ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+