• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మన్మోహన్ కు 'సత్యం' పోటు?

By Staff
|

Manmohan Singh
న్యూఢిల్లీ: భారత్, అమెరికా దేశాల మధ్య అనేక రంగాల్లో సత్ సంబంధాలున్నా, అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి భారతదేశం నుంచి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కానీ, కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కానీ హాజరు కాలేదు. ఇందుకు సత్యం' కుంభకోణమే కారణం కావచ్చని రాజకీయ నిపుణులు విశ్లేసిస్తున్నారు.అలాగే ఆర్థిక మంత్రిత్వశాఖను కూడా మన్మోహనే నిర్వహిస్తున్న సమయంలో సత్యం' కుంభకోణం వెలుగు చూడడం ఆయనను చిక్కుల్లో పడేసింది.

సత్యం వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని అమెరికా నుంచి ఒత్తిడి పెరిగింది. మన్మోహన్‌సింగ్‌ అనారోగ్యానికి ఈ ఒత్తిడి కూడా కారణం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఒత్తిడి వల్లే మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం గుండెకు సంబంధించిన అనారోగ్యంతో ఢిల్లీలో ఆస్పత్రిలో చేరారనుకుంటున్నారు. ఆయనకు శనివారం బైపాస్‌ శస్త్ర చికిత్స జరుగుతోంది.

"సత్యం" కుంభకోణంపై విచారణలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మెతకగా వ్యవహరిస్తున్నారన్న విషయం ఆర్ధిక నిపుణుడైన ప్రధాని మన్మోహన్ గ్రహించినట్టు జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ కుంభకోణం విచారణ తీరుపై ప్రధాని సంతృప్తిగా లేరని తెలుస్తోంది.

నిజానికి... ఇండియాలో ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా, భారత్‌-అమెరికాల దై్వపాక్షిక సంబంధాలు ఎన్నడూ దెబ్బతినలేదు. అలాగే అమెరికాలో రిపబ్లికన్‌లు రాజ్యమేలినా, డెమొక్రాట్‌లు ప్రభుత్వ పగ్గాలు చేపట్టినా రెండు దేశాల సంబంధాలు మరింత పెరిగాయే కానీ క్షీణించలేదు. ఐటి రంగంలో భారతీయ నిపుణులు అమెరికాలో ఎన్నో సేవలందిస్తున్నారు. అలాగే భారతదేశంలో అభివృద్ధి పథకాలకు ప్రపంచబ్యాంక్‌ అపారంగా నిధులు అందించడం వెనక కూడా అమెరికా హస్తముందనే చెప్పాలి. గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఒక చారిత్రక సందర్భమని చెప్పుకోవాలి.

గతంలో జి-7, జి-21లలో ఇండియాకు సభ్యత్వం లేకున్నా, ఆయా గ్రూప్‌లు నిర్వహించిన శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధానికి ఆహ్వానం అందిం దంటే దాని వెనక అమెరికా ప్రేరణ ఉందని గట్టిగా చెప్పవచ్చు. అలాగే యూఎస్‌లో న్యూయార్‌‌క స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో ప్రసంగించడానికి అమెరికా భారత ప్రధానినికి అవకాశం ఇవ్వడంమనదేశంపట్ల అమెరికాకున్న అపారమైన గౌరవానికి తిరుగులేని నిదర్శనం. అలాగే, భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వంకోసం జరిగే ప్రయత్నంలో అమెరికా సహకారం కూడా ఉందంటారు.

రెండు దేశాల మధ్య ఇంతటి గౌరవ మర్యాదలు, సన్నిహితత్వం, సహకారం ఉన్నా ఈ నెల 20న జరిగిన అమెరికా నూతన అధ్యక్షుడిగా బారక్‌ ఒబామా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇండియా నుంచి అధికారికంగా రాష్టప్రతి, ప్రధాని వంటి ఉన్నత హోదాలో ఉన్న వారెవరూ హాజరు కాలేదు. ఒబామా ప్రమాణస్వీకారోత్సవానికి చాలా దేశాల ఆధినేతలు హాజరయ్యారు. కానీ భారతదేశం నుంచి ఆ స్థాయి వారు ఎవరూ అంటే రాష్టప్రతి కానీ, ప్రధాని కానీ, కేంద్ర మంత్రివర్గంలో ఎవరైనా కానీ ఇండియా ప్రతినిధిగా హాజరు కాకపోవడానికి కారణమేమిటి? అన్నది పలువర్గాల వారిని వేధిస్తున్న ప్రశ్న.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X