హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల్లుపై పవన్ సత్యాగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్: అల్లు అరవింద్ కు పవన్ కల్యాణ్ కు మధ్య సంబంధాలు చెడిపోయాయని ఖచ్చితమైన సమాచారం. ప్రజారాజ్యం టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చినా పార్టీ ముఖ్యులు దానిని గట్టిగా ఖండించకపోవడం, టికెట్ల పంపిణీ బాధ్యతను పూర్తిగా తీసుకున్న అరవింద్ పారదర్శకంగా వ్యవహరించకపోవడంపై పవన్ కల్యాణ్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం ముగిసినప్పటినుంచీ పవన్ పార్టీ వ్యవహారాలకు చాలా దూరంగా ఉంటున్న విషయాన్ని మే 25న "సినిమాల్లోనే ఖుషీ" అనే శీర్షికతో ఈ పోర్టల్ ప్రచురించిన విషయం గుర్తుండే ఉంటుంది.

సమీప బంధువులతో కూడా కమర్షియల్ గా వ్యవహరించే అల్లు అరవింద్ అంటే ముక్కుసూటిగా నడుచుకునే పవన్ కల్యాణ్ కు మొదటి నుంచీ అంతంత మాత్రం సంబంధాలే ఉన్నాయి. ఐదేళ్ళ క్రితం అల్లు అరవింద్ పవన్ తో ఒక సినిమా నిర్మించారు. ఆ సినిమా బాగా ఆడకపోవడంతో అరవింద్ అక్కడా ఇక్కడా చేసిన వ్యాఖ్యలు పవన్ కు బాధ కలిగించాయి. దీనిపై ఆయన ఒక సినిమా పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అరవింద్ గుండెకు తాకేలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మధ్యలో చిరంజీవి అనే ఆత్మీయ వ్యవస్ధ లేకపోయి ఉంటే పవన్, అల్లు సంబంధాలు ఎప్పుడో కట్ అయిపోయి ఉండేవి.

అల్లు అరవింద్ పై పవన్ తాజా ఆగ్రహానికి (ఆయన ప్రతిపాదిత సినిమా "సత్యాగ్రహం") కారణాలివి:
అన్నయ్య చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా, అరవింద్ వాణిజ్య దృక్పధం వల్ల ఆ అవకాశం పోయిందని. తన మనుషులు అనుకున్న వారికి టికెట్లను ఇవ్వకుండా అల్లు అడ్డుకున్నారని. కొన్ని స్ధానాల్లో తాను ప్రచారం చేసినా అల్లు అరవింద్ వైఖరి వల్ల అక్కడ మంచి ఫలితాలు రాలేదని. అల్లు అరవింద్ టికెట్ల కోసం తాను తీసుకున్న అడ్వాన్సులను కొందరికి వెనక్కి ఇస్తూ, కొందరిని తిప్పించుకోవడం, దాని వల్ల పార్టీకి మరింత అప్రదిష్ట రావడం.

తాను అధ్యక్షుడిగా ఉన్న యువరాజ్యం బాధ్యతలను ఎవరికైనా అప్పగించాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. యువరాజ్యం వ్యవస్ధను సమూలంగా ప్రక్షాళించిన తర్వాత కొత్త వ్యక్తికి అప్పగించాలని ఆలోచిస్తున్నారు. "పులి" షూటింగ్ లో 70 రోజుల పాటు ఆయన ఏకధాటిగా పాల్గొనబోతున్నారు. ఆ పని అయిపోయిన తర్వాత యువరాజ్యాన్ని ప్రక్షాళించాలనుకుంటున్నారు. యువరాజ్యం వయోపరిమితిని 30 నుంచి 35 కు కుదించాలని ఆయన యోచిస్తున్నారు.

అల్లు అరవింద్ ను చిరంజీవి ఇప్పటికీ వెనకేసుకు వస్తున్నారు.బాధ్యత తీసుకున్న వారి మీదనే రాళ్ళు పడతాయని ఆయన చెప్పారు. దీనిని బట్టి వారిద్దరి మధ్య ఎంత సఖ్యత, సర్దుబాటు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ చాలా సెన్సిటివ్. ఎక్కడైనా తప్పు జరిగిందంటే, జనం దాని గురించి చర్చించుకుంటున్నారంటే ఆయన సహించలేరు. అందుకే ఆయన ఎన్నికల తర్వాత పుణె వెళ్ళిపోయి ప్రశాంతంగా గడిపి వచ్చారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన బాగా కుంగిపోయారు. తన అన్నగారిని మరో ఐదేళ్ళ వరకు ముఖ్యమంత్రిగా చూడలేకపోయే పరిస్ధితి వచ్చినందుకు బాధపడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X