అన్నపై అలిగాడా?

Pawan Kalyan
హైదరాబాద్: రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని చిరంజీవి ఇప్పుడు మరోసారి అనుకోవలసిన పరిస్ధితి దాపురించింది. తాజాగా మోహన్ బాబు విసిరిన సవాళ్ళను, లేవనెత్తిన పాయింట్లను చిరు సమర్ధంగా తిప్పికొట్టలేకపోతున్నారు. ఆయన ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు. అందువల్లనే ఆచితూచి మాట్లాడవలసి వస్తోంది. డైలాగ్ కింగ్ అయిన మోహన్ బాబుకు పోయేది ఏమీ లేదు.

గతంలో ఓకసారి ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు అప్పటికప్పుడు పవన్ కల్యాణ్ స్పందించి ప్రత్యర్ధులకు మాటలు రాకుండా చేశాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నయ్య చిరుకు దూరదూరంగా ఎందుకు ఉంటున్నాడో అని సన్నిహిత వర్గాలు, వారి అతి సన్నిహిత వర్గాలతో గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీ టికెట్ల పంపకంలో అల్లు అరవింద్ అన్నీ తానే అన్నట్టు వ్యవహరించడం, టికెట్ల కోసం ఆయన ఒకొక్కరి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు రావడం, దానితో పబ్లిక్ లోకి ర్యాంగ్ సిగ్నల్స్ వెళ్ళడం తెలిసిందే.

స్వతహాగా ఆవేశపరుడైన పవన్ దీనిపై అప్పుడే అన్నగారి వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కానీ అరవింద్ లేనిదే ఏ నిర్ణయమూ తీసుకోలేని చిరంజీవి ఆవేశపడవద్దని సర్ది చెప్పినట్టు చెబుతున్నారు. పవన్ ఆవేశపడినట్టుగానే ఎన్నికల ఫలితాలు రావడంతో అల్లు అరవింద్ ను తాను వ్యతిరేకించడం తప్పు కాదన్న నిశ్చితాభిప్రాయానికి పవర్ స్టార్ వచ్చారు. రాజకీయాల మీద ఆసక్తి పోయిందని అతను అన్నగారికి చెప్పుకున్నప్పుడు, "ఫర్వాలేదు. వచ్చే ఎన్నికల్లో బాగా చేద్దాం. ఈ ఐదేళ్ళు నువ్వు నీ కెరియర్ మీద దృష్టి పెట్టు" అని చిరంజీవి సెలవిచ్చారట. అన్నగారి మాటలను ఆయన శిరసావహించారని అనుకోవచ్చు.

కానీ రాజకీయాలకు దూరంగా ఉంటే ఉండవచ్చు కానీ మోహన్ బాబు చిరు మీద చేసిన వ్యాఖ్యలను పవన్ ఎందుకు ఖండించలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. అన్నగారి వల్ల మనస్ధాపం చెందకపోతే పవన్ ఈ సందర్భంలో ఎందుకు మౌనం వహిస్తాడని పాయింట్ లాగుతున్నారు. పవన్ కు, అల్లు అరవింద్ కు చాలా కాలంగా ఆత్మీయ సంబంధాలు దెబ్బతిన్నాయి. పవన్ తో సినిమా తీసి దెబ్బతిన్ననంటూ పరోక్షంగా అరవింద్ చెప్పడం దానికి ఒక ఇంటర్వ్యూలో పవన్ ఘాటుగా తిప్పికొట్టడం నాలుగేళ్ళ క్రితం జరిగాయి. అరవింద్ ను చంకన వేసుకుని అన్నయ్య తన ఇమేజిని పోగొట్టుకుంటున్నాడని తమ్ముడి ఆవేదనగా కన్పిస్తోంది. ఈ చిన్న చిన్నవి అవే సర్దుకుంటాయని అబిమానులు ఆశాభావంతో ఉన్నట్టు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+