వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలేకరులపై రోశయ్య చురకలు, చమత్కారాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య నేటి మధ్యాహ్నం నిర్వహించిన మీడీయా కాన్ఫరెన్స్ ఆయన చతురతకు నిదర్శనమని చెప్పవచ్చు. ఇంత క్లిష్ట సమయంలో ఇంత లేటు వయసులో ఆయన ఆ సమావేశాన్ని చక్కగా ముగించారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్ లు మీడీయాలో తమ సొంత గ్రూపును పెంచి పోషించుకునేవారు. ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురుకాకుండా చూసుకునేవారు. జర్నలిస్టు సంఘాల నాయకులతో రహస్య సంబంధాలు పెట్టుకునేవారు. ఎవరైనా కొత్త విలేకరి మంచి హోం వర్క్ తో వచ్చి మంచి ప్రశ్న సంధిస్తే అడ్డుపడేవారు. రోశయ్యకు అలా లాబీనీ తయారుచేసుకునేటంత సమయం లేదు, ఆ విధమైన మనస్తత్వం ఉన్నట్టు కూడా కన్పించదు.

సోనియమ్మ ఏది చెబితే అది చేస్తానని రోశయ్య పైకి చెబుతున్నా ఆయన తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలనుకుంటున్నట్టు కన్పిస్తోంది. అది కలిసి ఉండడమా, విడిపోవడమా-ఏదైనా కావచ్చు కానీ తన వరకు తాను ముఖ్యమంత్రిగా తన పరిధుల్లో బాగా పనిచేశానని అన్పించుకోవాలన్న తపన ఆయనలో కన్పిస్తోంది. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు, ఆ తర్వాత అనుబంధ ప్రశ్నకు జవాబుగా రోశయ్య స్పందించిన తీరు బాగుంది. "ఈ రోశయ్య చెప్పింది రాసుకోండి, ఆ తర్వాత నా అభిప్రాయమిది అని రాసుకోండి" అని ఆయన విలేకరికి ఉన్న పరిమితులను చెప్పకనే చెప్పారు. దానితో మిగితా విలేకరులు అవాక్కయ్యారు.

రోశయ్య సమర్ధుడా? అసమర్ధుడా? నిజాయితీ పరుడా? అవినీతి పరుడా అన్నది ఇక్కడ సమస్య కాదు. ఒక సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని ఆయన నడిపిస్తున్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తే ఆయన సీఎం పదవి కోల్పోతారు. అందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు కన్పిస్తోంది. ప్రాంతీయ వాదం వల్ల రాష్ట్రం నష్టపోతోందని, ముఖ్యంగా సినిమా పరిశ్రమ తిరిగి చెన్నై కి తరలిపోయే ప్రమాదముందని, స్ధానికంగా ఉపాధి పొందుతున్న సినిమా సాంకేతిక కార్మికులు నష్టపోతారని ఆయన చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రా వారిదే కాదని చెబుతూ, తెలంగాణకు చెందిన కొందరు సినీ ప్రముఖుల పేర్లను చదివి విన్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X