ముఖ్యమంత్రి పదవిపై మళ్ళీ జగన్ కు ఆశలు!

కీలక సమయంలో సమైక్య సందేశాన్ని గట్టిగా విన్పించడం ద్వారా జగన్ కాంగ్రెస్ హై కమాండ్ కు గట్టి సంకేతాలనే పంపారు. వైఎస్ మనిషి అయిన లగడపాటి రాజగోపాల్ నాయకత్వంలో కోస్తాంధ్రలో సమైక్య ఉద్యమం పటిష్టంగా కొనసాగుతోంది. జగన్ దానిని కొండంత అండగా భావిస్తున్నారు. జగన్ ప్రసంగం ఎక్కడా ఆవేశపూరితంగా లేదు. కంఠస్తం చేసుకుని విన్పించినట్టుగా ఉంది. ఈ సమయంలో తనకు రాష్ట్రం పగ్గాలు ఇస్తే సమైక్యాంధ్రను చక్కగా నడిపిస్తానని, అధిష్టానవర్గానికి అనవసరపు తలనోప్పులు తీసుకురానని ఆయన చెప్పకనే చెప్పనట్టయింది.
అపార అనుభవం గల రోశయ్య నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన బాగానే ఉన్నప్పటికీ ఆయనలో డైనమిజం లోపించింది. ఎంతవరకు హైకమాండ్ పై ఆధారపడి ఉండడం తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఆయనకు లేకపోవడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విసుగు కలిగిస్తోంది. ఇప్పుడు వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన వీరప్ప మొయిలీ వంటి వారు జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇప్పించడానికి పావులు కదిపే అవకాశముంది. తేనెతుట్టెను కదిపి బాధపడుతున్న సోనియా గాంధీ ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో మరో తొందరపాటు నిర్ణయం తీసుకుంటారా? కొంత కాలం రోశయ్యనే కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.












Click it and Unblock the Notifications