వైఎస్- వర్షం!

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా చివరి మూడేళ్ళలో వర్షాలు పడలేదు. ఆయన పరిపాలనా దక్షుడైనా వర్షాలు పడని కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పనులు లోపించి ఆయన మీద వ్యతిరేకత బలపడింది. చివరికి వరుణ దేవుడే ఆయనను అధికారం నుంచి దించేసినట్టయింది.
ఒక పెద్ద రాష్ట్రంలో పడే మంచి వర్షం ఒక చిన్న రాష్ట్రపు వార్షిక బడ్జెట్ తో సమానం. వర్షం ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ మీద అంత ప్రగాఢంగా ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజుల్లోపే వైఎస్ జెరూసలెం వెళ్ళి ఏసు ప్రభువుకు ప్రార్ధనలు చేసి వచ్చారు. ఆ తర్వాత తిరుమల వెళ్ళి వెంకటేశ్వరుడికి నమస్కరించుకుని వచ్చారు. ఏసు ప్రభువుకు, వెంకటేశ్వర స్వామికి మధ్య వైరుధ్యం కారణంగానే వరుణదేవుడు మొరాయించాడన్న జోకులు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఆ జోకుల మాట ఎలా ఉన్నా పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్న కారణంగా రుతుపవనాలు విఫలమౌతున్నాయన్న సంగతి పర్యావరణ ప్రేమికులందరికీ తెలుసు.
ఇక రాజకీయాల విషయానికి వస్తే రుతుపవనాలు గత ఏడాది ఇదే విధంగా మొరాయించి ఉంటే రాజశేఖరరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదు. ఈ సంవత్స్రరం వర్షా భావం కారణంగా ఆయనకు నష్టం లేకపోయినా జనం దారుణంగా నష్టపోతున్నారు. బియ్యం, పప్పుల ధరలు బాగా పెరిగిపోతున్నాయి.












Click it and Unblock the Notifications