కెసిఆర్ పై బ్లాక్ మెయిలింగ్ఆరోపణలు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చూడడానికి సాక్షాత్తూ భువి నుంచి 60 ఏళ్ళ క్రితం దిగి వచ్చిన నాయకుడు కెసిఆర్ అని కొందరు తెలంగాణ వాదులు విశ్వసిస్తారు. కెసిఆర్ తో తప్ప మరొకరితో తెలంగాణ రాదని వీరి భయం. నెల్లూరు జిల్లా నుంచి హైదరాబాద్ లో స్ధిరపడి వేలాది కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన జివి కృష్ణారెడ్డి హైదరాబాద్ లో, తెలంగాణలో తన ఆస్ధులను కాపాడుకునేందుకు కెసిఆర్ కు 50 కోట్లు ఇచ్చినట్టు ఒక వార్తా కథనం ప్రచారంలో ఉంది. జివికె కాకుండా ఇంకా అనేక మంది సీమాంధ్ర నాయకులు కెసిఆర్ కు 'విరాళాలు' ఇచ్చినట్టు వదంతులు వస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ 'అదుర్స్' ను తెలంగాణలో ఆడనివ్వబోమని ప్రకటించిన కెసిఆర్ కుమార్తె కవితకు ఆ తర్వాత 2 కోట్ల రూపాయలు అందాయని ఒక ప్రముఖ వెబ్ సైట్ ప్రముఖంగా రాసింది. డబ్బు అందిన తర్వాత రాజీ కుదిరి తెలంగాణలో సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చారని వెల్లడించింది. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అనుకోవాలేమో.

కెసిఆర్ స్వయంగా స్ధితిమంతుడు. దొరల కుటుంబంలో పుట్టిన ఆయనకు చాలా ఆస్ధులున్నాయి. ఆయన ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి సంపాదించుకోనవసరం లేదేమో. కేంద్రమంత్రి షిప్పింగ్ మంత్రిగా కూడా ఆయన బాగా సంపాదించుకున్నారని, అందువల్లనే తర్వాత ఆయనను డబ్బు ప్రాధాన్యం లేని కార్మిక శాఖకు పంపించారని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఇందులో సత్యమెంతో అసత్యమెంతో తేలవలసి ఉంది. ప్రముఖంగా వెలిగేవారి మీదనే దుష్ప్రచారాలు ఎక్కువగా ఉంటాయి.

ఏపార్టీ కైనా రిలయెన్స్ తరహాలో విరాళాలు ఇచ్చే గుణం జివికెలో ఉందంటున్నారు. దాని ప్రకారం జివికె కెసిఆర్ కు కొద్దో గోప్పో బహుమతిగా ఇచ్చిన విషయం నిజమైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+