చిరంజీవి ఇప్పుడు నిజంగా కొందరి వాడే

చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమిస్తారన్న వార్తలు వచ్చినా ఆయన రాజకీయాల్లో ఇంకా నటిస్తూ జీవిస్తూ ఉన్నారు. తెలంగాణపై చంద్రబాబు అటు ఇటుగా ఉండి ముందుకు వెళ్ళలేని పరిస్ధితిలో ఉన్నారు. రోశయ్య మాత్రం హై కమాండ్ ఎలాగంటే అలా అన్న ధోరణిలో ఉన్నారు. చిరంజీవికి కోస్తా ఆంధ్ర, రాయలసీమలో జనం ఆదరణ పెరిగింది. ఆయన ఢిల్లీలో తన వాదన విన్పించి సమైక్యాంధ్రకు దన్నుగా నిలిచారు.
కానీ మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో చిరంజీవి వ్యూహం విజయవంతమవుతుందా లేదా అన్నది సందేహమే. మధ్యంతర ఎన్నికలు వస్తే ఆయన సీమాంధ్రలో విజయం సాధించే అవకాశాలున్నాయి. ఎన్నికలు రాకపోతే ఆయన సమైక్యవాదం వీగిపోవచ్చు. మరో నాలుగేళ్ళపాటు ఆయన ప్రజారాజ్యం పార్టీని బతికించుకోవడం కష్టమే.












Click it and Unblock the Notifications