చిరంజీవి తెలంగాణ తంత్రము

ఆ కారణంగానే తెలంగాణలో చిరంజీవిని తిరగనివ్వమని హెచ్చరికలు చేశారు. తెలంగాణలో తిరిగితే ప్రజలు రాళ్లతో కొడతారన్నారు. అయితే చిరంజీవి ఆదివారం అదిలాబాద్ లోని ప్రాణహిత పుష్కరాలలో పాల్గొని శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కేంద్రం తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. సామాజిక తెలంగాణ, సమైక్యాంద్ర, తాజాగా తెలంగాణ అంటూ చిరంజీవి గళమెత్తడానికి కారణాలు తెలంగాణ పర్యటనలో తనకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఒకటి కాగా, తెలంగాణలో పూర్తిగా నిర్వీర్యం అయిన ప్రజారాజ్యాన్ని బలోపేతం చేయడం రెండో కారణం.
అందులో భాగంగానే చిరంజీవి శ్రీకృష్ణ కమిటీకి కట్టుబడతామంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. రోడ్డు మార్గాన వెళితే తెలంగాణవాదులు అడ్డుకుంటారనే భయంతోనే చిరంజీవి ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రాణఙిత పుష్కరాలకు వెళ్లారని అంటున్నారు. ప్రజా సమస్యలపై సీమాంధ్రలో పర్యటిస్తున్న చిరంజీవి తెలంగాణలో మాత్రం పర్యటించే సాహసం చేయలేకపోతున్నాడు. ఒకవేళ చిరంజీవి పర్యటన ప్రకటించినా తెలంగాణవాదులు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ కారణంగా ఆయన తెలంగాణలో తిరిగి పార్టీని బలోపేతం చేయాలంటే సమైక్యాంధ్ర, తెలంగాణ అని అనకుండా శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటామని ప్రకటిస్తే సరిపోతుందని అనుకున్నట్టున్నారు. నివేదికకు కట్టుబడి ఉంటామని చెప్పటం ద్వారా అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో కొన్నాళ్లు పార్టీ బలోపేతంపై దృష్టి సారించవచ్చుననే యోచనలో ఉన్నట్టున్నారు.












Click it and Unblock the Notifications