సీమాంధ్ర ఖాతాలో గీతారెడ్డి

గీతారెడ్డి సీమాంధ్రకు చెందిన రామచంద్రారెడ్డిని పెళ్లి చేసుకున్నారని, అందువల్ల ఆమె సీమాంధ్రకు చెందినవారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డిని ఆమె వివాహమాడారు. ఆడపిల్ల పెళ్లయిన తర్వాత అత్తింటివారికి చెందుతుందని, కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిని వివాహమాడిన గీతారెడ్డి ఆ జిల్లాకు చెందినవారేనని సుఖేందర్ రెడ్డి అన్నారు. అది తెలంగాణ సంప్రదాయమని కూడా ఆయన చెప్పారు.
గీతారెడ్డి న్యాయవ్యవస్థలో తెలంగాణవారికి దక్కిన ఉద్యోగాలపై ఓ పత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణవారికే ఎక్కువ ఉద్యోగాలు దక్కాయని ఆ పత్రంలో ఉంది. దీంతో ఆమెపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఫైర్ అయ్యారు. గీతారెడ్డి పచ్చి అబద్దాలకోరు అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ గౌడ్ అన్నారు. గీతారెడ్డికి తప్పుడు లెక్కలు అందాయని మరో తెలంగాణ పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. ఏమైతేనేం, తెలంగాణవారు గీతారెడ్డిని స్థానికేతరుల ఖాతాలో జమకడతారా అనే ప్రశ్న తలెత్తుతోంది.












Click it and Unblock the Notifications