జగన్ పర్యటనలు రోశయ్యకు పెద్ద సవాల్!

YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు వైయస్ జగన్ గట్టిగానే ఒత్త్తిడి పెట్టినట్టు ఉన్నాడు. ఏప్రిల్ 2 నుంచి ఆయన సాగించనున్న 'ఓదార్పు యాత్ర"కు నిన్న కృష్ణాజిల్లా గన్నవరంలో గంట కొట్టారు. ముఖ్యమంత్రి కంటే తానే గొప్ప అనే సంకేతాన్ని ఆయన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పంపగలిగారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి జగన్ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సాగనుంది. ఈ విషయంలో హై కమాండ్ అనుమతిని జగన్ కోరాడు. కానీ ఇంత వరకు సమాధానం లేదు. హైకమాండ్ ను ధిక్కరించి ఆయన ఈ యాత్రలు చేయగలిగితే (అందుకు కుటుంబ శ్రేయోభిలాషి కెవిపి కూడా అవునంటే) జగన్ "మగధీర" కింద లెక్కే.

వివిధ జిల్లాల్లో ఇప్పటికే జగన్ కు అనుకూలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు గుంటూరు జిల్లా మంచి ఉదాహరణ. ఎమ్మ్మెల్యే కాసు కృష్ణారెడ్డి సహా చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ కు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు. కోస్తా ఆంధ్రకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, వట్టి వసంతకుమార్, పార్ధసారధి, వివేకానందరెడ్డి తదితరులు గట్టిగా జగన్ పక్షాన నిలువనున్నారు.

ఆంధ్రప్రదేశ్ అంతటా జగన్ పర్యటన కోసం రంగం సిద్ధమైంది. తెలంగాణలో ఆయన పర్యటన తెలంగాణ రాష్ట్ర సాధనకు విఘాతమని భావించిన మధు యాష్కి గౌడ్ జగన్ కు ఆ ప్రయత్నం విరమించుకోమని చెప్పారు. మిగితా జిల్లాల్లో ఆ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. సాక్షి మీడియా అందుకు బాగా దోహదం చేస్తోంది.

మొత్తమ్మీద త్వరలో ముఖ్యమంత్రి రోశయ్యకు జగన్ రూపంలో ఒక పెద్ద శక్తి ఎదురు కాబోతోంది. తండ్రి వైయస్ పివి, జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి వృద్ధులతో ఢీకొన్నారు. ఇప్పుడు ఆదే వారసత్వాన్ని పురస్కరించుకుని జగన్ 75 ఏళ్ల రోశయ్య వంటి వృద్ధుడిని ఢీకొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+