తెలంగాణలో జగన్ పర్యటన?

వైయస్ జగన్ ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను చేపట్టి నెల రోజులు దాటింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఆయన నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపడతారని అంటున్నారు. విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి చెప్పారు. ఆయన ఓదార్పు యాత్ర ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో మాత్రమే జరిగింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓదార్పు యాత్ర ముగిసిన తర్వాతనే జగన్ తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల జగన్ ఓదార్పు యాత్ర తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఉండదని తెలిసిపోతూనే ఉన్నది.
కాగా, కాంగ్రెసులో వైయస్ జగన్ ను మించిన ప్రజాకర్షక నాయకుడు కాంగ్రెసులో లేరని కొండా సురేఖ భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. జగన్ ను కాదంటే కాంగ్రెసు పార్టీకి దిక్కు లేదని కూడా ఆయన అన్నారు. తాము వైయస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెసుకు జగన్ తప్ప గతి లేదనే పద్ధతిలో ఆయన వర్గీయులు మాట్లాడుతున్నారు. కాంగ్రెసును రక్షించే నాయకుడు జగన్ మాత్రమేనని చెప్పేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఏమైనా, జగన్ ఓదార్పు యాత్ర ఎటు దారి తీస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications