జగన్ కు పోటీగా పురంధేశ్వరి?

Purandeswari
కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీలో, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు వీలైన పరిస్థితులను కల్పించడానికి కమ్మ పారిశ్రామిక వేత్తలు ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం తిరిగి అధికారంలోకి రాకుండా రాష్ట్రంలో పురంధేశ్వరి కీలక పాత్ర పోషించాలని వారు ఆశిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి అంత సజావుగా లేకపోవడంతో, ఆయన తిరిగి అధికారంలోకి వస్తారనే నమ్మకం సన్నగిల్లడంతో వారంతా పురంధేశ్వరిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసులోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల అండదండలు ఆమెకు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను దెబ్బ తీయడానికి పురంధేశ్వరిని అడ్డుపెట్టడమే సరైన ఎత్తుగడగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. పురంధేశ్వరికి తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం వల్ల, సీమాంధ్రలో బలం పుంజుకునే అవకాశాలు లేనందున చంద్రబాబుకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో వారు పడ్డారని, అందుకే కాంగ్రెసులో పురంధేశ్వరికి అండదండలు అందిస్తున్నారని అంటున్నారు.

ఈ స్థితిలో వైయస్ జగన్ కు గ్రామీణ ప్రాంతాల్లో రెడ్ల మద్దతు పెరుగుతోంది. ఈ స్థితిలోనే కాంగ్రెసు నుంచి వైయస్ జగన్ ను పూర్తిగా విడదీయాలనే ప్రయత్నాలు మీడియా చేస్తోందని అంటున్నారు. జగన్ అపరిపక్వత, అనుభవరాహిత్యం, దూకుడుతనం ఆ మీడియాకు బాగా కలిసి వస్తోందనే మాట వినిపిస్తోంది. కాంగ్రెసులో పురంధేశ్వరి రాష్ట్ర నాయకురాలిగా ముందుకు వస్తే తిరిగి తమ చేతుల్లోనే అధికారం ఉంటుందని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అనుకుంటున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+