తెలంగాణకు ముందు సిఎంగా జైపాల్

Jaipal Reddy
ప్రత్యేక తెలంగాణ ప్రకటించేకన్నా ముందుగానే తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టడానికి ప్లీనరీ వేదిక కానున్నట్టు ముమ్మర ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 16వ తేదిన నిర్వహించిన మహాగర్జన ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ నాయకులపైన బాగానే పడినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చేది కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే అయినా అది కేసిఆర్ ఒత్తిడి వల్లనే అనే భావన ప్రజల్లో కలుగుతుందనే భావల తెలంగాణ కాంగ్రెస్ వారు భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్లీనరీలో వారు తెలంగాణ విషయంపై మాట్లాడే అవకాశం ఉంది. ఈ విషయంపై అధిష్టానం నుండి స్పష్టమైన నిర్ణయానికి వారు పట్టు బట్టవచ్చు. ఓ వైపు ఆదర్శ్, 2జి స్పెక్ట్రం, కామన్వెల్తు కుంభకోణాలు మరోవైపు బీహార్ రాష్ట్రాల వైఫల్యాల నేపథ్యంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశాలను ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని పార్టీలు మధ్యంతర దిశగా పరిశీలిస్తున్నాయి.

ఈ నెల 31లోపు పిళ్లైకి నివేదిక సమర్పించిన అనంతరం, జనవరి 3 లేదా 4వ తేదిలో శ్రీకృష్ణ కమిటీ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తెలంగాణ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్లీనరీలో పాల్గొంటున్న వీరంతా అక్కడ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. ఓ మంత్రి కూడా జైపాల్ రెడ్డిని పవర్ కేంద్రంగా అభివర్ణించడం గమనార్హం. తెలంగాణకు వ్యతిరేకి అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయ్యే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కాస్త ఆలస్యమైనప్పటికీ రాష్ట్రం ఇచ్చే ముందు తెలంగాణకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టే దిశలో తెలంగాణ కాంగ్రెస్ వారు అధిష్టానాన్ని అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రకటనకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సైతం మరో ఆరునెలలే ఆ పీఠంపై ఉంచుతారనే వాదనలు కూడా జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలనే యోచనకు బలం చేకూరుస్తున్నాయి. రోశయ్య ముఖ్యమంత్రి పీఠం నుండి దిగినప్పుడు మొదట అధిష్టానం జైపాల్ రెడ్డివైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ ప్రకటించకపోతే సమస్యలు తలెత్తే అవకాశాలున్నందున ఆయన దూరం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇఫ్పుడు తెలంగాణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తుండటంతో జైపాల్ రెడ్డిని చివరి ముఖ్యమంత్రిగా సిఎంపీఠంపై కూర్చుండబెట్టడానికి అధిష్టానం కూడా సంసిద్ధత వ్యక్తం చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+