హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు పుత్రుడు లోకేష్ పై వార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Lokesh
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కుమారుడు లోకేష్ చేసి పనికి ఆయన తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు సమీప బంధువు, జూనియర్ ఎన్టీఆర్ కాబోయే మామ నార్నే శ్రీనివాస రావు పెట్టిన స్టూడియో - ఎన్ టీవీ చానెల్ నిర్వహణ బాధ్యతను చంద్రబాబు కుమారుడు లోకేష్ చేపట్టారు. విదేశాల్లో చదివిన లోకేష్ స్టూడియో - ఎన్ ను పూర్తి స్థాయిలో మార్చేయడానికి కంకణం కట్టుకున్నారట. ఇందులో భాగంగా ఒక్క దెబ్బతో 70 మంది ఉద్యోగాలను స్టూడియో - ఎన్ నుంచి తొలగించారు. వారిలో 90 శాతం మంది తెలంగాణకు చెందినవారని చెబుతున్నారు. దాంతో చంద్రబాబుకు కష్టం వచ్చి పడింది. తెలంగాణకు చెందినవారు కాబట్టే వారిని తొలగించారనే నిందను చంద్రబాబు మోయాల్సిన స్థితిలో పడ్డారు. ఇప్పటికే తెలంగాణ పట్ల వైఖరికి చంద్రబాబు తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడిందంటున్నారు. కొడుకు లోకేష్ చేసిన పనికి ఆయనకు ఏం చేయాలో పాలు పోవడం లేదని అంటున్నారు.

మరో సమయంలోనైతే ఎంత మంది ఉద్యోగులను తొలగించినా పెద్దగా అల్లరి ఉండేది కాదు. ఇప్పటికీ ఆంధ్రప్రభ వంటి మీడియా సంస్థలు ఒక్కొక్కరిని ఏరి గుట్టు చప్పుడు కాకుండా వెనక్కి పంపించే సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఒకేసారి అంత మందికి ఉద్వాసన పలకడంతో ఒక్కసారిగా మంట పుట్టింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న సాక్షి టీవీ చానెల్, దినపత్రిక ఉద్యోగుల ఉద్వాసనపై చంద్రబాబును దుమ్మెత్తి పోస్తున్నాయి. సాక్షి టీవీ చానెల్లో ఆ వార్తాకథనం గురువారం ఎడ తెరిపి లేకుండా ప్రసారమైంది. మరోవైపు తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ ఆ వార్తాకథనానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రసారం చేస్తోంది. తెలంగాణకు చెందినవారు కాబట్టే తొలగించారంటూ దుమ్మెత్తి పోస్తోంది. తెలంగాణ జర్నలిస్టుల సంఘం ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు అండగా నిలిచింది.

హైదరాబాదులోని మణికొండలో గల స్టూడియో - ఎన్ కార్యాలయం ముందు ఉద్వాసనకు గురైన ఉద్యోగులు ధర్నాకు దిగారు. తిరిగి తీసుకునే వరకు ఆందోళన సాగిస్తామని అంటున్నారు. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కూడా వారికి మద్దతు ప్రకటించింది. సాక్షి, రాజ్ న్యూస్ తప్ప మిగతా మీడియా సంస్థలు ఉద్వాసనకు గురైన ఉద్యోగుల ఊసు ఎత్తడం లేదు. అవన్నీ ఏదో మేరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడం, లేదా ఆ పార్టీతో పెట్టుకోవడం ఎందుకు అనే పద్ధతిలో వ్యవహరించడం వల్ల ఆ ఊసు ఎత్తడం లేదు. ఈ మీడియా వార్ స్టూడియో ఎన్ పుణ్యమా అని కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. లోకేష్ చర్య వల్ల చంద్రబాబు ఇరకాటంలో పడాల్సి వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X