ఒబామా రోజు ఖర్చు రూ. 900 కోట్లు

అయితే ఒబామా పర్యటనకు అమెరికా అంత భారీ ఖర్చు చేస్తున్నప్పటికీ భారత్, మహారాష్ట్రలు గట్టి భద్రతతో పాటు భారీ ఖర్చు చేస్తోంది. ఇప్పటికై ముంబయి పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. ముంబయి సముద్రతీరంలో గస్తీ నౌకలను నిలిపింది. ముంబయి విమానాశ్రయంలో ఒబామా దిగిన తర్వాత రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్లో వచ్చేలా చర్యలు చేపట్టింది. ఒబామా బస చేయనున్న తాజ్ హోటల్ కు రెండురోజుల ముందునుండే అన్ని రహదారులు మూసివేశారు. రహదారులు, పరిసర ప్రాంతాలన్నింటినీ క్షుణ్ణంగా పరీక్షించింది.
ఒబామా ఉగ్రవాదులకు హెచ్చరికగా వారు దాడి చేసిన తాజ్ హోటల్లోనే బస చేయనున్నారు. ఆ తర్వాత శనివారం హోలీహోమ్ పాఠశాలలో దీపావళి వేడుకల్లో పాల్గొంటారు. ఆరు, ఏడు తేదీల్లో ఒబామా ముంబైలో ఉంటారు. ముంబై ఉగ్రవాద దాడుల బాధితులను ఆయన పరామర్శిస్తారు. ఏడవ తేదీన ఆయన ఢిల్లీ వెళ్తారు. ఆయన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీలతో, కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. నెల రోజుల పాటు ఆయన ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆయితే, పాకిస్తాన్ ను మాత్రం ఆయన సందర్శించడం లేదు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఒబామాపై గుర్రుగా ఉంది.












Click it and Unblock the Notifications