'స్వాతి' బలరామ్ కు అల్లుడి శని?

Swathi Weekly
తన పత్రిక పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు వేమూరి బలరామ్. వేమూరి బలరామ్ ను స్వాతి బలరామ్ గా పిలుస్తారు. అంతగా ఆ స్వాతి వారపత్రికను ఆయన పెంచి పోషించారు. ఒంటి చేతి మీద ప్రారంభించి ఇప్పుడు విశేష జనాదరణ పొందిన పత్రికగా స్వాతిని తీర్చిదిద్దారు. తెలుగు ప్రజల ఇళ్లలో దాన్ని అనివార్య సరుకుగా చేర్చారు. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి వంటి వివిధ వారపత్రికలు రాజ్యమేలుతున్న సమయంలో సాహసం చేసి వేమూరి బలరామ్ దాన్ని ప్రారంభించారు. వాటి పోటీని తట్టుకుని నిలబడడమే కాదు, వార పత్రిక అంటే స్వాతి ఒక్కటే అన్నంతగా తీర్చిదిద్దారు. అలాంటి పత్రిక ఈరోజు చిక్కుల్లో పడింది. వేమూరి బలరామ్ కృషి ఆస్తి తగాదాల వల్ల బూడిదలో పోసిన పన్నీరుగా మారే పరిస్థితి వచ్చింది. అల్లుడు అనిల్ కుమార్ దానికి ప్రధాన సూత్రధారి అని వేమూరి బలరామ్ ఆరోపిస్తున్నారు.

స్వాతి కార్యాలయాన్ని ఇటీవల అల్లుడి సహాయంతో బలరామ్ కూతురు, భార్య స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సహకారంతో వారు బలరామ్ లేని సమయం చూసి స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. తన కార్యాలయం స్వాధీనంపై వేమూరి బలరామ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తన అల్లుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వేమూరి బలరామ్ అల్లుడు అనిల్ కుమార్ ఆదాయం పన్ను శాఖలో అదనపు కమిషనర్ గా పనిచేస్తున్నారు. తన అధికారాన్ని వినియోగించి అనిల్ కుమార్ విజయవాడ నగర పోలీసు కమిషనర్ పై ఒత్తిడి తెచ్చారని, దీంతో పోలీసు కమిషనర్ తన భార్యకు, కూతురుకు అనుకూలంగా వ్యవహరించారని వేమూరి బలరామ్ ఆరోపిస్తున్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయన అభ్యంతరం చెప్పారు. తమ వ్యవహారంలో పోలీసుల జోక్యాన్ని నివారించాలని ఆయన హైకోర్టు అభ్యర్థించారు. తనను తన కార్యాలయంలో ప్రవేశించడానికి అనుమతించాలని కూడా ఆయన కోరారు.

స్వాతి యాజమాన్యం హక్కు వివాదం పెండింగ్ లో ఉందని చెబుతూ తన కార్యాలయం నుంచి భార్య, అల్లుడు, కూతురు తీసికెళ్లిన కీలక పత్రాలను తనకు తిరిగి ఇప్పించాలని ఆయన కోరారు. మొత్తం మీద, వేమూరి బలరామ్ తీవ్రమైన చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు. లక్షలాది మంది పాఠకుల చేతుల్లో అలంకారంగా ఉంటూ వస్తున్న స్వాతి వారపత్రిక భవిష్యత్తు కూడా చిక్కుల్లో పడిందనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+