జగన్ క్యాంప్ మంత్రులకు షాక్?

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన మంత్రులకు షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రులపై పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్య కసరత్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు. వారం రోజులుగా అధిష్టానంతో ఈ విషయంపై చర్చలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడాది దాటినా సొంత మంత్రివర్గాన్ని రోశయ్య ఏర్పాటు చేసుకోలేకపోయారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంతోనే ఆయన నెట్టుకొస్తున్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని చేసిన సూచనను మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి బేఖాతరు చేసిన సందర్భాన్ని ఆసరాగా తీసుకుని ఆయన మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వారంలోగా మార్పులు జరగవచ్చునని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జగన్ వర్గానికి చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణపై కూడా వేటు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డికి డిమోషన్ ప్రమాదం ఉంది. వైయస్ మరణాంతరం సంభవించిన శాంతిభద్రతల సమస్యలను సాకుగా చూపి ఆమె శాఖను మార్చే అవకాశం ఉంది. వైయస్ విషయంలోనూ ఇతరత్రా ఏ విధమైన వివాదంలోకి చొరబడిన మంత్రి గీతారెడ్డి పట్ల అధిష్టానం సానుకూలంగా ఉంది. పైగా, ఆమె దళిత సామాజికవర్గం, తెలంగాణ ప్రాంతం సానుకూలాంశంగా ఉంది. ఇటీవలి కాలంలో అధిష్టానం వద్ద ఆమె ప్రాబల్యం పెరిగింది. దీంతో ఆమెకు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇచ్చి హోం శాఖను అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

కాగా, సీనియర్లు పలువురు రోశయ్య మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్ది చూపునకు ఆనని కుందూరు జానారెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, పి. శంకరరావు, డిఎల్ రవీంద్రారెడ్డి వంటి పలువురు సీనియర్లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మొత్తం మీద, రోశయ్య మంత్రివర్గంలో మార్పులు భారీగానే ఉంటాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+