సొంత కుంపటికి జగన్ రెడీ?

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సొంత కుంపటి పెట్టుకోవడానికి రంగం సిద్దం చేసుకున్నట్లే అనిపిస్తోంది. ఈ విషయంలో ఎక్కువ జాప్యం చేయడానికి కూడా ఆయన సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధిష్టానం తనపై చర్యలు తీసుకోవడానికి అవసరమైన రెచ్చగొట్టే చర్యలకు ఆయన పూనుకున్నట్లు అర్థమవుతోంది. సోనియా గాంధీపై నేరుగా విమర్శలు చేస్తూ తన సాక్షి దినపత్రికలో, సాక్షి టీవీ చానెల్ లో వార్తాకథనాలు ఇవ్వడాన్ని ఈ దృక్కోణం నుంచే చూడాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల్లో నెలల పాటు ఓదార్పు యాత్రలు చేపట్టి ఏడాది తర్వాతనో, మరింత సమయంతోనో వైయస్ జగన్ పార్టీ పెడతారని ఇంతవరకు విశ్లేషణలు సాగుతూ వచ్చాయి. అయితే, ఆయన దాని కన్నా ముందుగానే కాంగ్రెసు నుంచి బయటపడి సొంత పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. నెల్లూరులో జరిగిన ఓదార్పు యాత్ర ముగింపు సభకు విశేషమైన ఆదరణ లభించడంతో ఆయనలో విశ్వాసం పెరిగినట్లు భావించవచ్చు.

ఇప్పటి వరకు జగన్ ముఖ్యమంత్రి కె. రోశయ్యను, వి హనుమంతరావు వంటి కొంత మంది నాయకులను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన వైయస్ జగన్ మీడియా ఇప్పుడు సోనియాపై తీవ్రమైన దాడికి పూనుకుంది. యుపిఎ ప్రభుత్వం కుంభకోణాల మయంగా మారిందనే అనడమే కాకుండా రాయబరేలీకి సోనియా వెళ్లడం లేదంటూ దుమ్మెత్తిపోసింది. ఈ విమర్శలను కాంగ్రెసు నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఒకరకంగా పార్టీలోని వైయస్ జగన్ ప్రత్యర్థులకు కలిసి వచ్చింది. అయితే, జగన్ కోరుకుంటోంది కూడా అదేనా అనే అనుమానం కలుగుతోంది. పార్టీ అధిష్టానాన్ని, సోనియాను రెచ్చగొట్టడం ద్వారా తనపై చర్యలు తీసుకునేలా ఉసిగొల్పాలనేది కూడా ఆయన ఉద్దేశం కావచ్చు. అధిష్టానం చర్యలు తీసుకోగానే బయట పడి సొంత పార్టీని పెట్టుకోవచ్చునని కూడా ఆయన అనుకుంటూ ఉండవచ్చు.

ఏమైనా, పార్టీ అధిష్టానానికి, వైయస్ జగన్ కు మధ్య ఇంత వరకు సాగుతున్న దాగుడుమూతల వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే వైయస్ జగన్ పై అధిష్టానం చర్యలు తీసుకోవడమో, జగన్ తనంత తానుగా బయటకు రావడమో జరగవచ్చునని అనుకుంటున్నారు. ఈ నెలాఖరులోగానే ఆ పని జరిగి పోతుందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+