వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్య రాజకీయ ఎంట్రీకి సంకేతాలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
నందమూరి అందగాడు బాలకృష్ణ తన రాజకీయ ఆరంగేట్రానికి సంకేతాలు ఇచ్చినట్టేనా? అంటే అవుననే అంటున్నారు అభిమానులు, రాజకీయ పరిశీలకులు. ఇటీవల ఎన్నారైల నుండి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళాలు సేకరించే నిమిత్తం న్యూజెర్సీ, న్యూయార్క్ తదితర నగరాలలో పర్యటించి వారి నుండి భారీగా విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు బాలకృష్ణకు ఘనస్వాగతం పలికారు. కార్ల ర్యాలీతో, బాణాసంచా పేలుస్తూ మరోచోట హెలికాప్టర్ నుండి పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆయన పర్యటించిన అన్ని నగరాలలోనూ దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు.

సుమారు కోటి రూపాయలకు పైగా న్యూయార్కులోనే విరాళాలు వచ్చినట్లు సమాచారం. న్యూయార్కు నగరంతోనే ఆయన పర్యట ముగించుకొని భారత్ బయలుదేరారు. సుమారు ఆయన పక్షంరోజుల పాటు అమెరికా నగరాలలో పర్యటించారు. అయితే క్యాన్సర్ హాస్పిటల్ విరాళాల కోసం వెళ్లినప్పటికీ ఆక్కడ రాజకీయ వాసనలు గప్పుమన్నట్లుగా కనిపిస్తోంది. కొందరు ఆయన రాజకీయ ఆరంగేట్రంపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అమెరికా వేదికగా తన రాజకీయ ఆరంగేట్రానికి సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. అమెరికాలో విరాళాల సేకరణ సమయంలో ప్రవాసాంధ్ర విద్యార్థులు రాజకీయ ఆరంగేట్రంపై ప్రశ్నించినట్లు సమాచారం. అయితే దానికి బాలకృష్ణ నవ్వుతూ బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని ఆ కోరిక త్వరలో నెరవేరుతుందని చెప్పారు.

అంతేకాదు తాను రాజకీయాలలోకి వచ్చినప్పటికీ బావే ముఖ్యమంత్రి అని చెప్పారని తెలుస్తోంది. అంటే త్వరలో బాలయ్య బాబును మనం రాజకీయాల్లోనూ చూడవచ్చు. మరి చిత్రసీమలో టాప్ హీరోల్లో ఒకడుగా ఉన్న బాలయ్య రాజకీయాల్లో టాప్‌గా నిలుస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. అమెరికా పర్యనటలో బాలయ్య తన స్పీచ్‌తో ప్రవాసాంధ్రులను ఉత్సాహపరచడంతోనే ఆగకుండా రాజకీయ ఆరంగేట్రం చేస్తానని చెప్పడం ద్వారా రాష్ట్రంలోని తన అభిమానుల్లోని మంచి ఉత్సాహం కలిగించినట్టుగానే ఉంది. గత కొన్నేళ్లుగా బాలయ్య రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం జరుగుతున్నప్పటికీ బాలయ్యే స్వయంగా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం విశేషం.

English summary
Balakrishna gave indications about his political entry in USA speech. He said that he will come in politics soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X