మంగళగిరిలో రాష్ట్రంలోనే తొలి లీప్ స్కూల్.. స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమైన అడుగు వేసింది. 'లీప్' కార్యక్రమం కింద రాష్ట్రంలోనే తొలి మోడల్ స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు గ్రామంలో ప్రారంభమైంది. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో రూ.16 కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక పాఠశాలను తీర్చిదిద్దారు.

ఆధునిక విద్యాకేంద్రంగా మంగళగిరి నిడమర్రు ఉన్నత పాఠశాల

1983లో నిర్మించిన పాత జెడ్పీ ఉన్నత పాఠశాలను పూర్తిగా పునర్నిర్మాణం చేసి, ఆధునిక విద్యా కేంద్రంగా మార్చారు. 5.2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ స్కూల్‌లో తరగతి గదుల సంఖ్య 12 నుంచి 25కి పెంచారు. ప్రతి గదినీ స్మార్ట్ డిజిటల్ బోధనకు అనువుగా అప్‌గ్రేడ్ చేశారు. ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో పూర్తి బోధన అందుబాటులో ఉంది.

AndhraPradesh first LEAP Model School inaugurated in Nidamarru Mangalagiri with Rs 16 crore investment

అన్ని అధునాతన సౌకర్యాలతో స్కూల్

ఈ పాఠశాలలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో తొలిసారిగా యాంఫీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సృజనాత్మకత, వక్తృత్వం మరియు వ్యక్తిత్వ వికాసం కోసం ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇండోర్ స్టేడియం, విశాలమైన ఫుట్‌బాల్ గ్రౌండ్, పిల్లల ప్లే ఏరియా, 400 మంది సామర్థ్యం ఉన్న అత్యాధునిక డైనింగ్ హాల్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి ఆరు అత్యాధునిక ల్యాబ్‌లు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్, వొకేషనల్ మరియు ఇన్నోవేషన్ హబ్‌ను స్థాపించారు. ఈ ల్యాబ్‌లను అంతర్జాతీయ స్థాయి పరికరాలతో సమకూర్చారు. పాత స్కూల్‌లో 510 మంది విద్యార్థులు ఉండగా, కొత్త సౌకర్యాల వల్ల ఈ సంవత్సరం 1,100 మందికి విద్యార్థుల సంఖ్య పెరిగింది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ బడిలోనే పొందుతున్నారు.

ఆర్ధికబలం కోసం కీలక అడుగు వేసిన హైదరాబాద్ మెట్రో!
ఆర్ధికబలం కోసం కీలక అడుగు వేసిన హైదరాబాద్ మెట్రో!

ప్రతి నియోజకవర్గంలో లీప్ స్కూళ్లు ఏర్పాటు ప్లాన్

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తొలగించి, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా నాణ్యమైన విద్య అందించడమే లీప్ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. నిడమర్రు మోడల్ స్కూల్ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లీప్ స్కూళ్లు ఏర్పాటు చేసే యోచనలో విద్యాశాఖ ఉంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యా రంగాన్ని కొత్త ఎత్తులకు చేర్చుతుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+