వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేణుకా చౌదరి దూకుడు వెనక..

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Chowdary
తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన రేణుకా చౌదరి ఇప్పుడు ఢిల్లీ స్థాయికి ఎదిగారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె ఇప్పుడు ఎఐసిసి అధికార ప్రతినిధి హోదాను చేజిక్కించుకున్నారు. ఒక పార్టీ అధికార ప్రతినిధి అన్నప్పుడు ఆ పార్టీ విధాన నిర్ణయాల మేరకు పార్టీ వైఖరిని వివిధ విషయాల్లో వెల్లడించే అధికారిత ఉంటుంది. ఆ పదవిని చేపట్టినప్పటి నుంచి ఆమె పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడింది ఏమీ లేదనే చెప్పాలి. కానీ, ఒక్కసారిగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఆ హోదాను వాడుకున్నారు. తెలంగాణ సమ్మెకు వ్యతిరేకంగా ఆమె రెచ్చగొట్టే ప్రకటన చేశారు. తెలంగాణ సకల జనుల సమ్మెలో 80 శాతం మంది ప్రజలు లేరని ప్రకటించి ఆమె అగ్నికి ఆజ్యం పోశారు.

శస్త్రచికిత్స నిమిత్రం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అమెరికా వెళ్లిన సందర్భంలో ఆమె ఎఐసిసి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. సోనియా తనయుడు, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చలువ వల్లనే ఆమెకు ఆ పదవి దక్కిందనేది పార్టీ వర్గాలు చెప్పే మాట. దాన్ని ఎలా చేజిక్కించుకున్నా, దాన్ని వాడాల్సిన పద్ధతిలో వాడలేదనే మాట ఓ వైపు వినిపిస్తుండగా, ఆమె ప్రకటన వెనక కూడా రాహుల్ గాంధీ ఉన్నారనే మాట వినిపిస్తోంది. రాష్ట్రానికి చెందిన నాయకురాలి చేత తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేయించడం ద్వారా రాహుల్ గాంధీ తన తెలంగాణ వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకున్నారని చెబుతున్నారు.

రేణుకా చౌదరి నిజానికి, అందరు సీమాంధ్ర నాయకుల మాదిరిగానే తన తెలంగాణ వైఖరిని ప్రదర్శించడానికి వచ్చిన అవకాశాలన్ని వినియోగించుకున్నారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చిన పద్ధతిలో ఆమె వ్యవహరించారు. దాంతో రేణుకా చౌదరిపై తెలంగాణ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఆమెపై పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఆమెపై తెలంగాణ నాయకులు కటువుగానే మాట్లాడారు.

నిజానికి, ఖమ్మం జిల్లాలో ఆమె తెలంగాణవాదుల చేతిలో పలుమార్లు చేదు అనుభవాన్ని ఎదుర్కున్నారు. అలా ఎదుర్కున్న ప్రతిసారీ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ వచ్చారు. కానీ, ఢిల్లీ పీఠం మీద కూర్చుని తన తెలంగాణ వ్యతిరేక వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారనే మాట వినిపిస్తోంది. తెలంగాణలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఇక్కడే ఎదిగిన ఆమె తెలంగాణ సమాజంలో కలిసిపోలేదని, అందువల్లనే ఆ తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారని అంటున్నారు.

English summary
It is said that Rahul Gandhi is there behind Renuka Choudary's anti Telangana statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X