భాను బినామీగా యాంకర్ శ్వేతారెడ్డి

హైదరాబాదులోని స్కిన్ టచ్ అనే సంస్థలో శ్వేతారెడ్డి పేర భాను కిరణ్ నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు వార్త ప్రసారమైంది. అలాగే, హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లోనూ శ్వేతారెడ్డి పేర భాను పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఓ సినీ నిర్మాత ద్వారా భాను కిరణ్ శ్వేతా రెడ్డికి పరిచయమైనట్లు తెలుస్తోంది. ఆ పరిచయం ఆమె పేరు మీద భాను కిరణ్ పెట్టుబడులు పెట్టేదాకా ముదిరినట్లు చెబుతున్నారు. అయితే, తనను పరిచయం చేసిన నిర్మాతనే భాను ద్వారా శ్వేతారెడ్డి చావచితకకొట్టించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ ఎన్నారై మహిళ భూమిని టీవీ యాంకర్ పేర రిజిస్ట్రేషన్ చేయించడానికి భాను గ్యాంగ్ ప్రయత్నించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భాను కిరణ్ భూదందాలపై పోలీసులు విస్తృతంగా సమాచారం సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications