కాంగ్రెసుకు కలిసిరాని చిరంజీవి

కడప లోకసభ స్థానంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. వైయస్ జగన్‌పై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలను ఓటర్లు ఏ మాత్రం పట్టించుకోలేదని అర్థమవుతోంది. వైయస్ జగన్‌కు, వైయస్ విజయమ్మకు భారీ మెజారిటీ రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ అవినీతిపై చేసిన ఆరోపణలు కూడా వృధా అయ్యాయి.
తమిళనాడులో కూడా చిరంజీవి ప్రచారం చేశారు. ఆయన మూడు రోజుల పాటు ప్రచారం సాగించారు. తమిళనాడులో కూడా ఆయన ప్రచారం కాంగ్రెసుకు కలిసి రాలేదని అర్థమవుతోంది. తమిళనాడులో కాంగ్రెసు 65 స్థానాలకు పోటీ చేయగా నాలుగు స్థానాలు మాత్రమే దక్కాయి. దీన్ని బట్టి చిరంజీవి ప్రచారం కాంగ్రెసుకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చి పెట్టలేదని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెసు ఎక్కువ సీట్లు తీసుకుని ఆ సీట్లను కోల్పోవడం ద్వారా డిఎంకెను కూడా దెబ్బ తీసిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications