చిరంజీవి ఊహించిందొకటి జరుగుచున్నదొక్కటి?

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు మాట్లాడినా చిరంజీవికి పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందని పల్లె వేస్తున్నారు. కాని అది ఎప్పుడో మాత్రం ఎవరూ చెప్పలేక పోతున్నారు. అవిశ్వాసం సమయంలో చిరు వర్గం అలకపాన్పు ఎక్కినప్పుడు కేంద్రమంత్రులు ఫోన్లు చేసి మరీ పిఆర్పీకి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కాని నిన్నగాక మొన్న యుపిఏలో చేరిన అజిత్ సింగ్‌కు కేబినెట్లో చోటు కల్పించిన కేంద్రం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అదుకున్నందుకు చిరంజీవికి ఇచ్చింది మాత్రం హామీలు మాత్రమే. విలీనం భేషరతుగా జరిగిందని ఇరువర్గాలు చెప్పుకున్నప్పటికీ రాజకీయ లబ్ధి ఆశించకుండా పిఆర్పీ విలీనమైందంటే హాస్యాస్పదం. చిరంజీవి లక్ష్యమేంటో అందరికీ తెలుసు.
తన లక్ష్యమిప్పుడప్పుడే నెరవేరదని చిరుకు తెలుసు. అందుకు ఆయన 2014 ఎన్నికలను టార్గెట్ పెట్టుకున్నారు. అది వేరే విషయం. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొడతానని సవాల్ విసిరినప్పుడు నేను నిలబెడతానని ప్రతి సవాల్ విసిరి
రాష్ట్రంలో కాంగ్రెసుకు అధికారాన్ని కాపాడిన చిరుకు ఆయన వర్గానికి ఇప్పటి వరకు దక్కింది మాత్రం ఏంలేదనే చెప్పవచ్చు. ఇన్నాళ్లు తెలంగాణ, జగన్ సమస్యలు చెప్పి చిరును పక్కన పెట్టారు. తీరా ఆ సమస్యలు తీరిపోయాక తాజాగా సొంత పార్టీ ఎంపీలు సీనియారిటీ పేరుతో ఆయనకు చెక్ పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విలీనానికి ముందు అధిక ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెసు ఇప్పుడు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే భావన చిరు వర్గంలోనూ కనిపిస్తోంది. మరి పది నెలలుగా పదవుల కోసం ఎదురు చూస్తున్న చిరుకు, చిరు వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications