రామానాయుడు ఆఫర్‌కు స్పందించని చిరు

అయితే ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి మాత్రం రామానాయుడు వ్యాఖ్యలకు స్పందించలేదు. కేవలం రాజేంద్ర సినిమా పైన మాత్రమే మాట్లాడారు. రాజేంద్రను అవయవదానం అంశంపై రూపొందించారని చెబుతూ ఒక వ్యక్తి చనిపోతూ అవయవ దానం చేస్తే తొమ్మిది మందికి జీవనం దానం చేసినట్లేనని చెప్పారు. కొన్నేళ్ల క్రితం రక్తదానం గురించి తెలిసినప్పుడు రక్త, నేతర దాన నిధి పెట్టానని వాటి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతుంటే ఆనందపడ్డానని చెప్పారు. అయితే రామానాయుడు ఆఫర్ గురించి మాత్రం మాట్లాడలేదు. అయితే అంతకుముందే మంచి కథ దొరికితే చేద్దామని తనతో చెప్పారని రామానాయుడు అన్నందువల్లే దానిపై ఇక స్పందించాల్సిన అవసరం లేదని చిరు అభిప్రాయపడ్డారో లేక సాధారణంగా మాట్లాడుకుంటూ వెళ్లారో కానీ ఆఫర్ పైన స్పందించక పోవడం వార్త అయింది.












Click it and Unblock the Notifications