వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెయ్యికోట్ల సచ్చిదానంద స్వామి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganapati Sachidananda Swami
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గణపతి సచ్చిదానంద స్వామికి వెయ్యి కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. హైదరాబాదు, అనంతపురం, బెంగుళూరులలో భారీగా భూములు కలిగి ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విదేశాలలో సైతం భారీగా ఆస్తులు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ధనపతి సచ్చిదానంద పేరుతో ఓ పత్రిక గురువారం గణపతి సచ్చిదానందపై ఓ కథనం ప్రచురించింది. గణపతి సచ్చిదానంద స్వామి అసలు పేరు సత్యనారాయణ. అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో ఓ పేద కుటుంబంలో జన్మించారు. ఎస్సెల్సీ చదివారు. పోస్ట్‌మ్యాన్‌గా, టీచర్‌గా పనిచేశారు. ఈ రొటీన్ బతుకు వద్దనుకున్నారు. తల్లి స్వస్థలమైన కావేరీతీరం చేరుకున్నారు. చిన్న ఆశ్రమం ప్రారంభించి, స్వామి గా ప్రకటించుకున్నారు. అలా మొదలైన ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం.. ప్రధానులు, సీఎంలు, పాదాభివందనం చేసేదాకా వచ్చింది. అమెరికాసహా 50కి పైగా ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా ఆలయాల నిర్మాణం, పూజాపునస్కారాలంటూ భక్తులను ఆకర్షించడం, దర్శనం, పాదపూజల పేరిట రూ.లక్షలు వసూలు చేయడం, ప్రముఖు లనుంచి భారీ విరాళాలు సేకరించడం నిత్యకృత్యంగా మారిం ది!

అంతా సక్రమంగా ఉండి, భక్తులు సమర్పించుకున్నది తిరిగి సామాన్యుల సేవకే ఉపయోగపడుతుంటే అంతకు మించిన మాధవ సేవ ఇంకేముంటుంది? కానీ... ఈ సాములోరి తీరు వేరు. భక్తులు సమర్పించినవి, ఆక్రమించుకున్నవి, ప్రభుత్వాల నుంచి పొందినవి... ఇలా భూ, ధనయజ్ఞం సాగించారు. ఒంటిమీద కాషాయం తప్ప ఏమీ ఉండని ఈ 70 ఏళ్ల స్వామి నేడు రూ.వెయ్యి కోట్లకుపైగా ఆస్తులకు అధిపతి! టిడిపి హయాంలో బీహెచ్ఈఎల్ పక్కన యువ పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇవ్వాల్సిన భూమిలో మూడెకరాలను మెదక్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే చొరవతో ఏపీఐఐసీ స్వామీజీకి అప్పగించింది. ఇంకేముంది యంత్ర శబ్దాలకు బదులు నిశ్శబ్దం, అప్పుడప్పుడు మంత్రశబ్దం అక్కడ వినిపిస్తోంది. ఆ భూమి విలువ ఇప్పుడు ఎంత లేదన్నా రూ.20 కోట్లు. ఇక దుండిగల్‌లో ఔటర్ రింగురోడ్డును ఆనుకొని 15 ఎకరాలలో బ్రహ్మాండమైన ఆశ్రమం, బేగంపేటలోని ఖరీదైన ప్రాంతంలో సమాచార కేంద్రం నడుస్తున్నాయి. ఇలా హైదరాబాద్‌లోనే స్వామికి రూ.100కోట్ల విలువైన ఆస్తులున్నాయి.

ప్రధాన ఆశ్రమం మైసూరులో ఉన్నా ఎక్కువ కాలం అక్క డే గడిపినా... ఆయన దృష్టి మనరాష్ట్రంలోని సంపన్న ప్రాంతాల మీదే ఉండేది. అందుకే 20 ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. వీటిద్వారా భారీగా విరాళాలు సేకరించి, మైసూరు కు తరలిస్తారనే విమర్శలున్నాయి. ఎందరో సంపన్నులు స్వామిద్వారా డబ్బును అధికాదాయ మార్గాలకు, సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. విజయవాడలోని పటమటలో 1.5 ఎకరాల విస్తీర్ణంలోగల ఆశ్రమం రూ.60 కోట్ల విలువ చేస్తుంది. దీనిలోనే కల్యాణమంటపా న్ని అద్దెకు ఇస్తుంటారు. పనిలోపనిగా ఆశ్రమం పక్కనే ఉన్న 1706 చదరపు గజాల నగరపాలక సంస్థ భూమిని ఆక్రమించి, పశువైద్యశాల ఏర్పాటుచేశారు. మొదట్లో కార్పొ రేషన్‌కు లీజు పేరిట కొంత చెల్లించినా తర్వాత మానేశారు. కృష్ణానది ఒడ్డున సీతానగరంలో స్వామికి రూ.కోట్ల విలువై న పదెకరాల భూమి ఉంది. ఏటా ఒకటి రెండుసార్లు స్వామి ఇక్కడకు వస్తారు. అప్పుడు తప్ప మిగిలినరోజుల్లో ఆశ్రమంలోకి ఎవరికీ అనుమతి ఉండదు.

మూడు దశాబ్దాలుగా ఇక్కడికి వస్తున్న స్వామిజీతో అప్పట్లో ఒక మహిళ సన్నిహితంగా ఉండేదని ప్రచారం ఉంది. ఇన్ని కోట్ల ఆస్తులకు వారసుడిగా శ్రీదత్త విజయానంద తీర్థ స్వామిని ప్రకటించారు. ఆయన పూర్వాపరాలు, సచ్చిదానందతోగల అనుబంధం అత్యంత రహస్యం! మైసూరు-ఊటీ ప్రధాన రహదారి చెంత 33 ఎకరాలు ఆక్రమించుకుని ఆశ్ర మం కట్టుకున్నారు. 20 ఏళ్ల తర్వాత చివరకు 1997లో ఆ భూమిని స్వామీజీకే కట్టబెడుతూ కర్ణాటక ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అప్పట్లో ప్రధానిగా ఉన్న పి.వి.నరసింహారావు ఇందుకు సహకరించినట్లు చెబుతారు. ఈ భూమి కేటాయింపును మైసూరులోని కర్ణాటక ప్రగతి రంగ స్వచ్ఛంద సంస్థ హైకోర్టు లో సవాలు చేసినా ఆ కేసు నిలవలేదనుకోండి! అయితే, ఆ సంస్థ సారథి ప్రొ ఫెసర్ రాందాస్ స్వామీజీ చరిత్రను బయటపెట్టారు. ఆయనపై మరో ఆరు భూ ఆక్రమణ కేసులున్నాయని, కోట్లకు కోట్లు నల్లధనం మూలుగుతోందని ఆ రోపించారు.

2008లో స్వామీజీ మీద ఓ భూకబ్జా కేసు నమోదవగా కర్ణాటక పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లడం అప్పట్లో సంచలనం కలిగించింది. మైసూరు ఆశ్రమం చెంత డాక్టర్ అనిల్‌కుమార్ భూమిని స్వామీజీ కలిపేసుకున్నారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించినా, భారీ పలుకుబడిగల స్వామీజీలను ఇ లాంటి కేసులు ఏం చేస్తాయి గనుక! సచ్చిదానంద మన రాష్ట్రంలోని అనంతపురం నగర నడిబొడ్డున ఎకరం స్థలంలో దత్తమందిరాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కలిపి అనంతపురంలోనే రూ.వందకోట్లకుపైగా ఆస్తులున్నాయి. ఆయ న స్వగ్రామం బొమ్మేపర్తి శివార్లలో 40 ఎకరాలు ఆక్రమించుకుని ఐదెకరాల్లో ఆశ్రమాన్ని నిర్మించారు. స్వగ్రామంలో వంద ఎకరాలకు పైగా ఉంది. రాగమ యి, భక్తిరంజని, అన్నదానం, దత్తపీఠం.. ఇలా ఎన్నో ట్రస్ట్‌ల పేరిట కార్యకలాపాలు నడుస్తున్నాయి. సేవాదళ్ స్వచ్ఛంద సేవకుల బృందం పనిచేస్తున్నది.

English summary
Ganapati Sachidananda Swamy have thousand crores rupees with him. A leading news paper revealed that today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X