చిరు వర్గం నేతకు భవానీ నజరానా

కృష్ణానదీ తీరంపై ఉన్న 111 ఎకరాల భవానీ ద్వీపం భూములు పర్యాటకంగా అత్యంత విశిష్టమైనవి. ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా తెచ్చి పెడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద 33 ఏళ్లకు ఆ భూములను లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్ కింద మరో 25 ఏళ్లు పొడగించడానికి కూడా అవకాశం ఉంది. అంటే, దాదాపు దాని యాజమాన్యాన్ని గంటా కంపెనీకి కట్టబెట్టడమేనని ఆ ఆంగ్ల దినపత్రిక వ్యాఖ్యానించింది. భవానీ ఐలాండ్ భూముల విలువ ఎకరానికి 4 కోట్ల రూపాయల చొప్పున 400 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. అయితే, ప్రభుత్వం దాని విలువను రూ. 20 కోట్లకే అంచనా వేసింది. దాన్ని లెక్కలోకి తీసుకుని కేవలం 1.11 కోట్ల లీజును నిర్ణయించింది. అంటే భూమి మొత్తం విలువలో అది కేవలం ఐదు శాతం మాత్రమే.
ఆంగ్లదినపత్రిక కథనం ప్రకారం - భవానీ ఐలాండ్‌లో 24 కాటేజీలు, రెండు రెస్టారెంట్లు, ఓ కాన్ఫరెన్స్ హాల్, మూడు ట్రీ - టాప్ కాటేజీలు ఉన్నాయి. బోటింగ్ జెట్టీలు, ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉన్నాయి. వారాంతాల్లో, సెలవు రోజుల్లో పెద్ద యెత్తున పర్యాటకులు వస్తుంటారు. భవానీ ఐలాండ్ నుంచి ప్రభుత్వానికి ఏడాదికి రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం దానిపై ఆదాయంలో పది శాతాన్ని కూడా ఖర్చు చేయడం లేదు. ప్రభుత్వ నిర్ణయంపై పర్యాటక శాఖ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications