జగన్ స్థానంలో తల్లి విజయమ్మ?

జగన్ కొన్ని రోజులు ప్రజల్లో లేని పరిస్థితి వచ్చినా విజయమ్మ పార్టీకి సారథ్యం వహిస్తారని మేకపాటి చెప్పడం ఇప్పుడు చర్చానీయాంశం అయింది. జగన్‌పై సిబిఐ విచారణ ప్రారంభం అయినప్పటి నుండి వైయస్సార్సీ పార్టీ పూర్తి నిరాశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సిబిఐ ప్రాథమిక దర్యాఫ్తులో జగన్ కంపెనీలలోకి అక్రమంగా పెట్టుబడులు వచ్చాయని తేలి హైకోర్టు పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తే జగన్‌కు మరిన్ని కష్టాలు తప్పవని వైయస్సాఆర్సీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. జగన్ చిక్కుల్లో పడ్డారనే భావనలో జగన్ వర్గం కనిపిస్తోంది. గతంలో హైకోర్టు జగన్ ఆస్తులపై సిబిఐని ప్రాథమిక దర్యాఫ్తుకు ఆదేశించిన సమయంలోనూ ఆ పార్టీ అధికార ప్రతినిధు అంబటి రాంబాబు జగన్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతూ ఒకవేళ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమాలు జరిగాయని తేలితే అందులో వైయస్ మంత్రివర్గం పాత్ర కూడా ఉంటుందని ఆరోపించారు.
అంబటి తన వ్యాఖ్యల ద్వారా జగన్ కంపెనీలలో అక్రమాలు జరగలేదని ఖచ్చితంగా ఖండించలేక పోయనట్టుగానే ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. జగన్ తీరు కూడా అక్రమాలకు అనుమానాలు తావిచ్చే విధంగా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. తన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించిన జగన్ శంకర్ రావు పిటిషన్‌పై హైకోర్టు ప్రాథమిక దర్యాఫ్తునకు ఆదేశించగానే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన ఆస్తులపై ప్రాథమిక విచారణ నిలిపి వేయాలని కోరారు. అయితే అందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. నిర్దోషి అని తేలితే మీకే లాభం కదా అని చెప్పింది. ఎలాంటి అక్రమాలకు పాల్పడక పోతే సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటని కాంగ్రెసు, టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications