వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్ర లీడర్ చంద్రబాబేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తన వైరాన్ని పక్కన పెట్టి చంద్రబాబును కలుసుకోవడం, సమైక్యాంధ్ర కోసం శాసనసభ సమావేశాల బహిష్కరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశానని చెప్పడం ఆ అనుమానాలకు మరింత ఊతమిస్తున్నట్లు చెబుతున్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడమే ముఖ్యమని, ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని తమ నాయకులకు స్వేచ్ఛనిచ్చానని ఆయన పదే పదే చెబుతున్నారు. ఏమైనా ఇబ్బంది కలిగించే ప్రశ్నలు వేస్తే మీడియాపై తన వ్యవహారశైలికి భిన్నంగా మీడియాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై ఆయన రెండు కళ్ల సిద్ధాంతం విశేష ప్రాచుర్యాన్ని పొందింది. తాను ఎటూ చెప్పకుండా ఇరు ప్రాంతాల నాయకులను ఉసిగొలుపుతూ సీమాంధ్ర నాయకులకు వెనక నుంచి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేయగానే అందుకు వ్యతిరేకంగా కథను నడిపింది చంద్రబాబేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు పదే పదే ఎత్తి చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాల కథను చంద్రబాబే నడిపించారని అంటున్నారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర రాజీనామాల లేఖలు చంద్రబాబు తయారు చేయించినవేనని కూడా విమర్శలున్నాయి. వీటన్నింటికీ సమాధానం చెప్పేవారు లేరు. కానీ చంద్రబాబు పూర్తి తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మాత్రం దండిగానే ఉన్నాయి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అనే పదాన్ని శానససభలో నిషేధించిన ఘనత కూడా ఆయనదే.

తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం లేదా కేంద్ర ప్రభుత్వం మార్చి మొదటివారంలో నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం బలం పుంజుకుంటోంది. దీంతో మరోసారి సీమాంధ్ర రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా జూలు విదిలిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం సమాయత్తం కావడానికి కాంగ్రెసు సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఈ నెల 5వ తేదీన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమవుతున్నారు. తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ఈ నెల 3వ తేదీన సమావేశమవుతున్నారు. వేర్వేరుగా సమావేశమవుతున్నప్పటికీ కార్యాచరణ మాత్రం ఒక్కటిగానే ఉండవచ్చునని అంటున్నారు. ఇందులో భాగంగానే జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబును కలిశారని అంటున్నారు.

English summary
It is learnt that TDP president N Chandrababu Naidu is leading united Andhra movement. Rumours spread that Congress Seemandhra MLA JC Diwakar Reddy met Chandrababu to seek advise on united Andhra movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X