వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మాటలను వక్రీకరించారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యను మీడియా వక్రీకరించిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని జగన్ అన్నట్లుగా మీడియా వ్యాఖ్యానించింది. నిజానికి, జగన్ అలా అనలేదు. గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయితే తనకేమిటి సంబంధమని, కర్ణాటకలోనో, బిజెపివారినో అడగండి అని ఆయన అన్నారు. జగన్ మాటలను వక్రీకరించారంటూ ఆయనకు చెందిన సాక్షి దినపత్రిక మండిపడుతూ శుక్రవారం ఓ వార్తాకథనాన్ని కూడా ప్రచురించింది.

"గాలిని అరెస్టు చేసిన విషయాన్ని నన్నెందుకు అడుగుతున్నారు. గాలి అరెస్టయితే పెళ్లి ఆయననో, బిజెపివాళ్లతోనో కర్ణాటకలో ఎవరితోనైనా మాట్లాడండి. అంతేగానీ ఆ పరిణామంతో నాకేం సంబంధం.." అని మాత్రమే అన్నట్లు ఆ పత్రిక రాసింది. దీన్ని వక్రీకరించారంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలపై సాక్షి దినపత్రిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లో కూటమిలోని ఆంధ్రజ్యోతిని తోక పత్రికగా సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది. గాలి ఎవరో తనకు తెలియనే తెలియదన్న జగన్ అంటూ ఆ పత్రిక రాయడాన్ని తప్పు పట్టింది. కాంగ్రెసులోకి వెళ్లడమనేది అసంభవమని, అది జరగని పని అని జగన్ సిఎన్ఎన్ - ఐబిఎన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నట్లు సాక్షి స్పష్టం చేసింది. జగన్ ఇంటర్వ్యూలోని కొంత భాగాన్ని సాక్షి దినపత్రిక ఇచ్చింది. ఈనాడు వార్తాకథనాన్ని కూడా సాక్షి తప్పు పట్టింది.

ఆ రెండు పత్రికలపై సాక్షి దినపత్రిక దుమ్మెత్తిపోస్తూ పెద్ద వార్తాకథానాన్నే ప్రచురించింది. మీడియా రెండుగా విడిపోయిన స్థితిలో రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చింది. సాక్షి దినపత్రిక వచ్చిన తర్వాత రాష్ట్రంలో మీడియా వార్ ఊపందకుంది. జీవించి ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ఆ రెండు దినపత్రికలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వచ్చారు. అదే సంప్రదాయాన్ని వైయస్ జగన్ కూడా కొనసాగిస్తున్నారు. ఢిల్లీ నాయకులను జగన్ కలిసినా దుష్ప్రచారమే సాగిస్తున్నాయని తనకు వ్యతిరేకమైన మీడియాను సాక్షి దుయ్యబట్టింది.

English summary
It is said that media is misquoted YSR Congress president YS Jagan words on Gali Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X